మన్యం మనుగడ, పినపాక :
మండల పరిధిలోని ఏడూళ్లబయ్యారం పంచాయితీ పోతురెడ్డిపల్లి గ్రామానికి కి చెందిన పండా రాఘవులు, ఎస్‌కే వలీపాషా ఇటీవల మృతి చెందటంతో వారి కుటుంబాలకు మైత్రి సేవా సంస్థ అండగా నిలిచింది. సోమవారం మైత్రి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకు
రూ.5 వేలు నగదు, 50 కేజీల బియ్యం సర్పంచ్ కోరం రజిని చేతుల మీదుగా వితరణగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో మైత్రి సేవా సంస్థ అధ్యక్షులు సానికొమ్ము (మైత్రి) వెంకటరెడ్డి, సభ్యులు బండారు రాంబాబు, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, స్దానికులు తునికి బాబురావు, ప్రసాద్, అఫ్రిద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: