CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఒక్కోసారి పడడం కూడా మంచిదే--:వనమా రాఘవ

Share it:

 


  • సోషల్ మీడియా లో పోస్ట్

మన్యం మనుగడ భద్రాద్రి జిల్లా ప్రతినిధి

కొత్త దామోదర్ గౌడ్

వనమా రాఘవ...ఇటీవలే ఆపేరు పతాక శీర్షిక లో సంచలనం ...జనవరి నెలలో రాఘవ వేదింపుల వల్లే ఓకే కుటుంబం లో ముగ్గురు సజీవ దహనం చేసుకొని మృతి చెందడం పాఠకులకు విధితమే. పాత పాల్వంచ కు చెందిన ఆ బాధిత కుటుంబ సభ్యులు సెల్ఫీ తీసుకొని వారి మానసిక వేదనకు కారణం ఐన వ్యక్తుల వివరాలు ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వనమా రాఘవ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.62 రోజులు జైలు జీవితం అనుభవించి హైకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చెయ్యడం జరిగింది. అనంతరం రాఘవ కొత్తగూడెం కి దూరంగా ఉండాలి అని బెయిల్ లో షరతు విధించిన నేపథ్యంలో ఏలూరు వెళ్ళాడు. అక్కడే రాఘవను కొత్తగూడెం కు చెందిన ఆయన అభిమానులు కలవడం జరుగుతుంది. ఈ క్రమంలో తన ఫేస్బుక్ అకౌంట్ లో శనివారం రాఘవ ఆశక్తి కర పోస్ట్ పోస్ట్ చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.

ఒక్కోసారి పడడం కూడా మంచిదే.. మన స్థాయి ఏంటో తెలుస్తుంది. లేపడానికి అందించే చేతులను బట్టి మనవాళ్లు ఎవరో తెలుస్తుంది. మనుషులను చదివే కళను కూడా నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను. పుస్తకాలకంటే ఎక్కువ ముఖాలపై రాసి ఉంటుందని విన్నాను.అనే వ్యాఖ్యలు fb లో పోస్ట్ చేశాడు.దీనితో గూడెం రాజకీయాలు ఆశక్తి గా మారాయి.

Share it:

TS

Post A Comment: