CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు ఆదేశాల మేరకు కరెంటు లైన్ ఏర్పాటు.

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామపంచాయితీ సత్యనారాయణ పురం కాలనీ లో కరెంటు సరిపోవడం లేదని ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని సర్పంచ్ కాక అశోక్, ఉప సర్పంచ్ టేకుల సురేష్ రెడ్డి, ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు కి తెలియజేశారు.ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేలా చూడాలని తెలియజేశారు. ఈరోజు ప్రభుత్వ విప్ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సత్యనారాయణపురం కాలనీలో ప్రజలకుఎటువంటి ఇబ్బంది పడకుండా 1 ఫేస్ కరెంట్ లైన్ ను నిర్మించడం జరిగింది. ప్రజలకు కరంటు కోత లేకుండా చేయడం జరిగింది,వెంటనే స్పందించిన ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు కి సర్పంచ్ కాక అశోక్, ఉపసర్పంచ్ సురేష్ రెడ్డి, గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: