CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మండలంలో మళ్లీ రెచ్చిపోయిన దొంగలు బంగారం,వెండి,నగదు అపహరణ .

Share it:

 


మన్యం టివి, దుమ్ముగూడెం::

దుమ్ముగూడెం మండలంలో చిన్ననల్లబెల్లి గ్రామంలో ఊకె చంద్రయ్య మాజీ సర్పంచు ఇంట్లో గుర్తుతెలియని దుండగులు రాత్రి 124 గ్రాముల బంగారం ,100గ్రాముల వెండి 6000 నగదు ఎత్తుకెళ్లారు బంగారం వెండి విలువ సుమారు 3,72,000 అయితే చంద్రయ్య ఎప్పటిలాగే వేసవి కాలం కావడంతో కుటుంబ సభ్యులతో గత నాలుగు రోజుల నుంచి డాబా పైకి వెళ్లి నిద్రిస్తున్నారు దీన్ని ఆసరాగా తీసుకున్న దొంగలు ఇంటి వేనక తలుపులు పగుల గొట్టి చోరీ చేశారు. ఉదయం 6 గంటలకు లేచి లోపలికి వెళ్ళేసరికి సామాన్లు చిందరవందరగా పడి ఉండడం గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు వెంటనే వచ్చి బీరువా లో ఉండవలసిన బంగారం వెండి విలువైన వస్తువులు నగదు అపహరించారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి గ్రామస్తులు సాయంతో ఊరు మొత్తం వెతకగా ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదు కొత్తగూడెం నుంచి క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించారు చంద్రయ్య ఫిర్యాదు మేరకు సీఐ దోమల రమేష్ కేసు నమోదు చేశారు. మండలంలో గత మూడు నెలలుగా జరిగినటువంటి దొంగతనాలు, మళ్లీ పునరావృతం కావడం తో మండలం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Share it:

TS

Post A Comment: