CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నెత్తురోడుతున్న అశ్వారావుపేట రహదారులు -వేగ నియంత్రణ లేని వాహనాలు -రక్షణ చర్యలు పట్టని ప్రభుత్వాలు.

Share it:

 


 మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్నంలో నిత్యం ఏదో ఒక ప్రమాదంతో అశ్వారావుపేట రోడ్లు నెత్తురోడుతున్నాయి. కొన్ని ప్రమాదాలు మద్యం మత్తులో జరిగితే, కొన్ని ప్రమాదాలు నిబంధనలు పాటించక అతివేగంతో జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో వెంటవెంటనే అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అశ్వారావుపేట సొసైటీ చైర్మన్ నూతక్కి నాగేశ్వరరావు, గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. ఎన్ని మరణాలు సంభవించినప్పటికీ ప్రమాదాల రేటింగ్ మాత్రం తగ్గటం లేదు. వేగ నియంత్రణ కోసం పోలీసు వారు ఏర్పాటు చేసిన డ్రమ్ము లను ఒక లారీ ఢీకొట్టడమే కాకుండా అటుగా వెళ్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థిని క్రింద పడిపోగా ఆ విద్యార్థిని కాళ్ళ పైనుండి లారీ వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. అశ్వారావుపేట లోని అగ్రికల్చరల్ కళాశాల నుండి రింగ్ రోడ్డు వరకు, జంగారెడ్డిగూడెం రోడ్డు లో పేపర్ బోర్డు వరకు అనేక ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ రక్షణ చర్యలు మాత్రం తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు అనేకం ఉన్నాయి. రింగ్ రోడ్డు నుండి ఖమ్మం రోడ్ లో అగ్రికల్చర్ కళాశాల వరకు అనేక రెస్టారెంట్లు, మీసేవ కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయం, మండల పరిషత్, రెవెన్యూ, ఫారెస్ట్, విద్యుత్ సబ్ స్టేషన్, కెమిలాయిడ్స్, సొసైటీ, ప్రభుత్వ హాస్పిటల్, ఆర్ డబ్ల్యూఎస్, ఫైర్ స్టేషన్, జూనియర్ కళాశాల, మేనేజ్ మెంట్ హాస్టల్, బీఈడీ కళాశాల, ఐటిఐ కళాశాల, ఇంకా అనేక ప్రభుత్వ కార్యాలయాలు నర్సరీలు ఉండటం వలన నిరంతరాయంగా తిరిగే వాహనాలతో పాటు అనేక పనుల కోసం వచ్చే ప్రజలతో నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారులపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నప్పటికి, ఎంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం రక్షణ చర్యలను గాలికి వదిలేసిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి జంగారెడ్డిగూడెం రోడ్, ఖమ్మం రోడ్ లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ప్రమాదాలు నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

Share it:

TS

Post A Comment: