CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సింగిల్ విండో సర్వ సభ్య సమావేశం.పలు అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానాలు.

Share it:

 



మన్యం మనుగడ మంగపేట: బుధవారం మంగపేట రైతు సేవా సహకార సంఘం కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మంగపేట రైతు సేవా సహకార సంఘం చైర్మన్ తోట రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం జమ ఖర్చులు, సంఘం అభివృద్ధిలపై సమీక్ష నిర్వహించి, సంఘం బడ్జెట్ ఆమోదించారు. సంఘ జమ ఖర్చులు లావాదేవీలు పరిశీలించి, అవి సరిగా ఉన్నందున సంఘ మహాజన సభ చర్చించి ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదించారు. సంఘం అంచనా బడ్జెట్ ను ఆమోదించారు. సంఘ అభివృద్ధిపై సమీక్ష లో భాగంగా సంఘం ద్వారా ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 854 లారీల ద్వారా ఒక్క ఖరీఫ్ సీజన్ లో కొనుగోలు చేసినందుకు సంఘ కార్యవర్గాన్ని అభినందించారు. మండల పరిధిలోని రైతులు అతి తక్కువ వడ్డీ కి బంగారు ఆభరణాలపై 60 లక్షల రూపాయల రుణాలు మంజూరు చేసినందుకు సంఘం కార్యవర్గాన్ని అభినందిస్తూ, ఇక ముందు కూడా ఇట్టి కార్యకలాపాలను కొనసాగిస్తూ సంఘం అభివృద్ధికి తోడ్పడాలని కార్యవర్గాన్ని కోరుతూ తీర్మానం ఆమోదించారు. సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, సహాయకులకు వేతన ఇచ్చుటకుగాను సంఘం కార్యవర్గానికి అధికారమిస్తూ ఏకగ్రీవంగా చర్చించి తీర్మానం ఆమోదించారు. సంఘం కం-గోడౌన్ నిర్మాణం కొరకు వర్క్ ఆర్డర్ రాగానే నిర్మాణం చేపట్టుటకు సంఘ కార్యవర్గంకు అధికారమిస్తూ మహాజన సభలో ఏకగ్రీవంగా ఆమోదించారు. సంఘంలో పని చేస్తున్న సిబ్బందికి పర్మనెంట్ చేయుటకు, పిఎఫ్, బోనస్ తదితర అలవెన్స్ మంజూరు చేయుటకు తగు మార్గదర్శకాలను జిల్లా సహకార అధికారిని కోరుతూ మహాజన సభలో ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించారు. డీసీఓ ఆదేశాల మేరకు బదిలీపై మంగపేట సింగిల్ విండో కార్యాలయంకు వచ్చిన ముత్తయ్య కు జాయినింగ్ తేదీ నుండి వేతనాలు చెల్లించుటకు కార్యవర్గంకు అధికారమిస్తూ మహాజన సభలో తీర్మానించారు. బంగారు నగలపై ఇచ్చు రుణాలను ఆరు నెలలకు ఒకసారి పర్యవేక్షించి బంగారు ధరలకు అనుగుణంగా అప్పు మంజూరు చేయటకు సంఘ కార్యవర్గం ఏకగ్రీవంగా చర్చించి తీర్మానించారు. సంఘంలో సభ్యులుగా ఉండి భూమిలేని, చనిపోయిన సభ్యులను తొలగించుట కోసం గ్రామాల వారీగా లిస్టును తహశీల్దార్ మంగపేటకు అందచేసి విచారణ అనంతరం సంఘంలో సభ్యులుగా ఉండి భూమి లేని వారిని, చనిపోయిన వారి సభ్యత్వాలను తొలగించే అధికారాన్ని సంఘం కార్యవర్గానికిఅధికారమిస్తూ మహాజన సభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. గత కార్యవర్గ తీర్మానాలను పరిశీలించి వాటిని సంఘ మహాసభ చర్చించి ఏకగ్రీవంగా తీర్మానంతో ఆమోదించారు. ఈ కార్యక్రమంలో మంగపేట రైతు సేవా సహకార సంఘం చైర్మన్ తోట రమేష్, వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్ యాదవ్, సొసైటీ సీఈఓ జగన్నాధం, డైరెక్టర్లు సిద్దంశెట్టి లక్ష్మణరావు, నర్రా శ్రీధర్, డేగల ఆదినారాయణ, చిట్టిమల్ల రజిత సమ్మయ్య, అచ్చ సత్యనారాయణ, సింగరబోయిన నర్సయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: