CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అర్హులైన వారందరికీ పెన్షన్ ఇవ్వాలని సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఇవ్వాలని భారీ ప్రదర్శన: ఎండీవో తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఐ ఎంఎల్ పార్టీ ధర్నాలు.

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 25 ) శుక్రవారం ;- అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్లు ఇవ్వాలని పేద ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఇంటి జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణం కొరకు అయిదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు నుంచి దమ్మపేట సెంటర్ పెట్రోల్ బంక్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మీదుగా ఎండీవో మండల తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా పాల్వంచ డివిజన్ కార్యదర్శి అమర్లపూడి రాము మాట్లాడుతూ ప్రభుత్వం సామాజిక భద్రత కింద అర్హులైన వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఒంటరి మహిళలకు గీత కార్మికులకు మరియు ఎయిడ్స్ బోదకాలు బాధితులకు ఆసరా పెన్షన్ నిరంతరం మంజూరు చేయాలని కానీ ప్రభుత్వం బాధ్యత మరిచి గత మూడు సంవత్సరాల కాలంలో నూతనంగా అర్హత పొంది ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన సుమారు మూడున్నర లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందించకుండా లబ్ధిదారులకు ఇబ్బంది పెట్టడం జరుగుతుందని వారు అన్నారు టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేకపోయినదని ప్రజావ్యతిరేక విధానాలను నిరంతరం పెంచి పోషించుకుంటూ వస్తుందని వారు అన్నారు . పేదలందరికీ డబుల్ బెడ్రూంలు ఇస్తానని ప్రకంపనాలు పలికి అందించటంలో పూర్తిగా విఫలం చెందిందని సొంత జాగా ఉన్నవారికి అయిదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కొరకు ఇస్తామని వాగ్దానాలు చేసి నేడు మూడులక్షలు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. అర్హులైన అయినా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఇది సరైనది కాదని వారు అన్నారు. 2019లో ఆసరా పెన్షన్లకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన మూడు లక్షల మందికి తక్షణమే పెన్షన్లు ఇవ్వాలని, ఒకే కుటుంబంలో అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలని, అన్ని రకాల పింఛన్లను నెలకు ఐదు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని , పేదలకు ఇళ్లస్థలాలు ప్రభుత్వమే ఇవ్వాలని ,అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, , అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందించాలని ,వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దుర్గమ్మ సంధ్యా కాకా వెంకటేష్ లక్ష్మి ప్రసాద్ వేంకటేశు ఆదినారాయణ ముత్యాల రావు కమల గిరి కాంతారావు యశోదా మొదలగు వారు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: