మన్యం మనుగడ : జూలూరుపాడు, మార్చి 28, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో ఈనెల 23 వ తారీకు జరిగిన హత్య యత్నం కేసు నందు కీలక వ్యక్తి అయిన బానోత్ బొజ్యా లాల్ అనే ఉపాధ్యాయుడు పై జూలూరుపాడు పోలీస్ స్టేషన్ నందు అండర్ సెక్షన్ 154, 307 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. ఈ విషయం పై మండల విద్యాశాఖ అధికారి జిల్లా విద్యాశాఖ అధికారికి నివేదిక సమర్పించడం జరిగింది. తదనుగుణంగా జూలూరుపాడు మండలం వాగొడ్డు తండా ఎంపీపీఎస్ పాఠశాల నందు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బానోతు బోజ్యా లాల్ ను విధుల నుండి తొలగించినట్లు మండల విద్యాశాఖ అధికారి జి వెంకట్ తెలిపారు.
Post A Comment: