మన్యం మనుగడ : జూలూరుపాడు, మార్చ్ 29, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే రెండు రోజుల సార్వత్రిక సమ్మె లో భాగంగా మండల కేంద్రంలో మంగళవారం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వామపక్షాల సంఘీభావంతో ర్యాలీ విజయవంతమయ్యింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినదించారు. అనంతరం ఆశ కార్యకర్తల దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోనీ, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నరసింహారావు, ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు, మండల రైతు బంధు కన్వీనర్ వీరభద్రం, జూలూరుపాడు ఎంపీటీసీ రాజశేఖర్, రామిశెట్టి రాంబాబు, నాగేశ్వరరావు, వేల్పుల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: