CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జె.వి.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కావడిగుండ్ల లో విద్యుత్ మోటార్లు పంపిణీ. -జలగం ప్రసాద్ సారథ్యంలో అర్హులైన పేదలకు అందజేత. -హాజరైన వివిధ రాజకీయ నాయకులు అధికారులు.

Share it:



మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, కావడిగుండ్ల గ్రామంలో స్వర్గీయ జలగం వెంగళరావు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మాజీ మంత్రివర్యులు జలగం ప్రసాదరావు, ఆధ్వర్యంలో కావడిగుండ్ల గ్రామంలోని నిరుపేద గిరిజనులకు 110 మందికి విద్యుత్ మోటార్లు, పంపుసెట్లు, స్టార్టర్లు అందజేయడం జరిగింది. ఏజెన్సీ ఏరియాలో భూమి ఉండి సాగునీటి అవకాశాలు లేని గిరిజనులకు ప్రభుత్వం ద్వారా విద్యుత్ శాఖ వారి తో మాట్లాడి ఎవరెవరికి ఎక్కడెక్కడ అవసరమో విద్యుత్ స్తంభాలు, కనెక్షన్లు ఏర్పాటు చేయించి రైతులకు అందించారు. అన్నీ తానై పేదలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలిన ప్రస్తుత పరిస్థితుల్లో జలగం వెంగళరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాజీ మంత్రి జలగం ప్రసాదరావు క్షేత్రస్థాయి పరిశీలన చేసి అర్హులైన నిజమైన పేదలకు దగ్గరుండి అన్నీ తానై సహాయ సహకారాలు అందించడం తమ అదృష్టమని ఏజెన్సీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో విద్యుత్ కనెక్షన్ కావాలంటే, మోటారు ఏర్పాటు చేసుకోవాలంటే ఒక పేదవాడికి సాధ్యమయ్యే పరిస్థితులు లేని ఈ రోజుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఇటు కావడిగుండ్ల నుండి అటు చర్ల వెంకటాపురం వరకు జలగం వెంగళరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుమారు 1000 విద్యుత్ కనెక్షన్ తో పాటు మోటార్లు, పంపుసెట్లు, స్టార్టర్లు ఏర్పాటు చేయించిన ఘనత జలగం వెంకళరావు చారిటబుల్ ట్రస్ట్ కే సాధ్యమైందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, కావడిగుండ్ల, కన్నాయిగూడెం గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులతో కలిసి ట్రస్ట్ నిర్వాహకులు మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు కావడి గుండ్ల గ్రామాల్లోని సుమారు 110 మంది అర్హులైన నిజమైన గిరిజన పేదలకు విద్యుత్ మోటార్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మోటార్లను ఎమ్మెల్యే తో కలిసి స్విచ్ నొక్కి మోటార్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ ఏజెన్సీ ఏరియా లోని గిరిజనులు భూమి ఉండి వాటికి సరైన నీటి వనరులు లేక పంటలు పండించు కొని అభివృద్ధి చెందలేక పోతున్నారని, గిరిజన ప్రజలు అందరూ కూడా అభివృద్ధి చెందాలనే కాంక్షతో జలగం వెంగళరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ఇటువంటి కార్యక్రమాలకు పేద ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ అనేక ప్రభుత్వ శాఖల వారు కూడా తమ శక్తి వంచన లేకుండా సహకరిస్తున్నారని విద్యుత్ శాఖ, ఐటీడీఏ, రెవిన్యూ, అటవీశాఖ, రోడ్లు మరియు భవనములు, సొసైటీ ఇలా అనేక శాఖలవారు పేద ప్రజల అభ్యున్నతి కోసం వారి వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, ఈ బృహత్తర కార్యక్రమాన్ని పేద గిరిజనులు అందరు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని వారు కోరారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయవచ్చని ఎల్లవేళలా ప్రజాసంక్షేమం కోసం జలగం వెంగళరావు చారిటబుల్ ట్రస్ట్ సిద్ధంగా ఉందని వారు తెలిపారు. అదేవిధంగా గాండ్ల గూడెం నుండి చెన్నాపురం వరకు అటవీ మార్గంలో రోడ్డు సౌకర్యం, కావడిగుండ్ల గ్రామానికి బస్సు సౌకర్యం, విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కూడా కల్పిస్తానని జలగం ప్రసాదరావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, నిర్మల పుల్లారావు, తహసిల్దార్ చల్లా ప్రసాద్, ఆర్టీవో సంఘం వెంకట పుల్లయ్య, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అబ్దుల్ రెహమాన్, స్థానిక నాయకులు కంగాల కల్లయ్య, దమ్మపేట సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వరరావు, ఎంపీటీసీ వాసం బుచ్చిరాజు, కావడి గుండ్ల కన్నాయిగూడెం సర్పంచులు కంగాల భూలక్ష్మి, గొంది లక్ష్మణరావు, రైతు సమన్వయ సమితి కన్వీనర్ జూపల్లి రమేష్, సీతారామ స్వామి, విద్యుత్ శాఖ, ఇరిగేషన్ శాఖ, రోడ్లు భవనములు శాఖ, డిఈ ఏఈ లు మరియు సిబ్బంది, గ్రామ స్థాయి నాయకులు బాడిశ లక్ష్మణ్ రావు, మామిళ్ళపల్లి శ్రీనివాసరావు, ప్రసాదు, జగ్గయ్య, నాగేశ్వరరావు వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: