CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చిన్న జీయర్ స్వామి దిష్టిబొమ్మ శవయాత్ర చేసి దహనం చేసిన ఆదివాసీలు.

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం: ఆదివాసీల ఆరాధ్యదైవం మేడారం సమ్మక్క దేవత పై చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలకు నిరసనగా మండల పరిధిలోని చిరుమల్ల గ్రామంలో కొలువై ఉన్న సమ్మక్క సారలమ్మ గుడి దగ్గర 9వ తెగ సమన్వయకర్త చుంచ రామకృష్ణ, గ్రామస్తులు, ఆలయ ధర్మకర్తలు, పూజారులు వడ్డెలు తల పతులు ఆధ్వర్యంలో చిన్న జీయర్ స్వామి శవ యాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం కోయ పున్నెం 9 తెగల సమన్వయ కర్త చుంచు రామకృష్ణ, స్థానిక సర్పంచ్ పాయం నరసింహరావు మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయం నమ్మకాన్ని విశిష్టతను అగౌరవపరిచే విధంగా మాట్లాడిన చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజానీకానికి ఆదివాసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నందున తెలంగాణ నుండి బహిష్కరించాలని తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర ఉత్సవంగా పరిగణిస్తున్న నేపథ్యంలో అగ్రవర్ణ బ్రాహ్మణులు ఈవిధంగా ఆదివాసీల మనోభావాలను కించపరిచే వ్యాఖ్యలు మతోన్మాద కుట్రలో భాగంగానే జరుగుతున్నాయని మతోన్మాదం ద్వారా ఆదివాసీలను కించపరచాలని చూస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కోయ పున్నెం ధర్మకర్తలు చందా భూపతయ్య ,గోవర్ధన్ రావు,రామారావు,గోపి,సాంబశివరావు,చందా శ్యామ్ కుమార్,రామకృష్ణ,ఇరప వెంకటేశ్వర్లు,మరియు గ్రామస్తులు,గ్రామయూత్ పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: