CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

శ్రీ శ్రీ శ్రీ చిలకల గండి ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవము ల ను జయప్రదం చేయండి -దేవస్థానం ఈవో శేషయ్య.

Share it:

 


మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, వినాయకపురం గ్రామంలో సుమారు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన, శ్రీశ్రీశ్రీ చిలకల గండి ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవంలను ఈనెల 30 నుండి ఏప్రిల్ మూడో తారీకు వరకు జరగనున్నాయని, ఈ జాతర మహోత్సవాన్ని జయప్రదం చేయాలని దేవస్థానం ఈవో శేషయ్య భక్తులకు తెలియజేశారు. అప్పటి నుండి అమ్మవారు నిత్య పూజలను అందుకుంటూ 46 సంవత్సరాల నుండి జాతర మహోత్సవాలు జరుగుతున్నాయన్నారు. 45 సంవత్సరాలుగా ప్రైవేటు వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగగా, 2007 నుండి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలను జాతర మహోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. కోవిడ్ కారణంగా మూడు సంవత్సరాల నుండి జాతర మహోత్సవాలు నిలిపి వేయబడ్డాయని, ఇప్పుడు జరగబోయే జాతర మహోత్సవాలకు, చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా ప్రక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు విచ్చేస్తారని, సుమారు మూడు లక్షల నుండి నాలుగు లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని యావన్మంది భక్తులు జాతర మహోత్సవాలకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు తెలిపారు. జాతర మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా దేవస్థానం కమిటీ, గ్రామ పెద్దల సహకారంతో సకల సదుపాయాలతో పూర్తి ఏర్పాట్లు చేశామని వారు తెలిపారు.

Share it:

TS

Post A Comment: