CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రభుత్వ భూమిలో అక్రమ ఇండ్ల నిర్మాణాలు.అడ్డుకున్న రెవిన్యూ శాఖ అధికారులు.అధికారులపై తిరగబడ్డ ఆక్రమణదారులు..

Share it:

 మన్యం మనుగడ జూలూరుపాడు, మార్చి 26,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామ రెవిన్యూ పరిధిలో గల 119 సర్వేనెంబర్ లో ఎంతో విలువైన (ఎస్సైన్మెంట్) ప్రభుత్వ భూమిని స్థానిక గిరిజనేతరుడు ఆక్రమించుకుని అట్టి భూమిని ప్లాట్లుగా చేసి అమాయక గిరిజనులు, గిరిజనేతర ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకోగా, కొనుగోలు చేసిన గిరిజనులు, గిరిజనేతరులు ప్రభుత్వ భూమిలో ఇండ్లు నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయంపై గత సంవత్సరం గ్రామస్తులు స్థానిక తహశీల్దార్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయగా, రెవెన్యూ అధికారులు విచారణ జరిపి అది ప్రభుత్వ భూమి అని దానిని ఎవరికీ అమ్మే హక్కు లేదని, ఎవరూ కొనుగోలు చేయవద్దని తెలియజేసి, ఆ స్థలము నందు హెచ్చరిక బోర్డు ను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఆ బోర్డు ను తొలగించి సుమారు 1-20 కుంటల విలువైన ప్రభుత్వ భూమిలో అక్రమ ఇండ్ల నిర్మాణాలు చేపట్టగా, విషయం తెలుసుకున్న రెవెన్యూ శాఖ అధికారులు శనివారం అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రయత్నం చేస్తుండగా అక్రమ ఇండ్ల నిర్మాణ దారులు రెవెన్యూ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్భంగా ఆర్ ఐ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిలో అక్రమ ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారని, తక్షణమే వాటిని తొలగించాలని మా పై అధికారుల ఆదేశానుసారం తొలగింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో చట్టాలకు విరుద్ధంగా విలువైన ప్రభుత్వ భూములను ఇంత బాహాటంగా ప్లాట్లుగా చేసి అమ్మి సొమ్ము చేసుకున్న గిరిజనేతరుడుకి స్థానిక రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో ఎవరి వాటాలు వారికి అందినట్లు కూడా గుసగుసలు వినబడుతున్నాయి. పడమట నర్సాపురం గ్రామ పంచాయతీ లో గల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమణ దారులనుండి కాపాడాలని రెవెన్యూ శాఖ వారిని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Share it:

TS

Post A Comment: