మన్యం మనుగడ ఏటూరు నాగారం
దేశవ్యాప్త 21వ సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా సిపిఎం,సిపిఐ,కాంగ్రెస్,సిఐ టియు అనుబంధ సంఘాలు భవన నిర్మాణ,కార్మికులు,
కర్షకులు,కార్పెంటర్,అంగన్వాడి,రైతు,వ్యవసాయ కార్మిక సంఘంల ఆధ్వర్యంలో మం డల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్లో గంటపాటు రాస్తారోకో నిర్వ హించి సిఐటియు మండల అధ్యక్షుడు బాలోజు రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్య క్రమంలో ముఖ్య అతిథి గా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎండి దావూద్,ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిటమట రఘులు పాల్లోని మాట్లాడుతూ కేంద్రం లోని నరేంద్ర మోడీ నాయక త్వంలో బిజెపి ప్రభుత్వ విధా నాలను వ్యతిరేకిస్తూ జరుగు తున్న కార్మిక,ప్రజాఉద్యమా లపై ఉక్కు పాదం మోపి రాజ్యాంగబద్ధంగా పౌరులకు ఉన్న ప్రాథమిక హక్కులను సైతం పాతరేస్తుందని,ఉపాధి,
నిరుద్యోగం,అధిక ధరలు,ఆకలి కేకలు,అసమా నతలు,ఆరోగ్య రక్షణ వంటి ప్రాథమిక సమస్య లను పట్టించుకోకపోగా ఈ సమస్యలు తీవ్రరూపం దాల్చే ఆర్థిక విధానాలను క్రూరంగా అమలు చేస్తూ ఇటీవల పార్ల మెంట్లో పెట్టిన కేంద్ర బడ్జెట్ లో కూడా సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టి సామాన్యులపై అధిక భారం మోపుతున్నారని అన్నారు. *సంపన్నులకు వరాలిచ్చి తన పెట్టుబడిదారీ వర్గం స్వభావాన్ని బహిర్గతం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం*
ప్రజల ఆదాయాలు దిగజారితే వందమంది కార్పొరేట్ల సంపద రూపాయలు 30 లక్షల కోట్లకు పెరిగింది.కేవలం 10 శాతం అత్యంత ధనవంతుల వద్దకు 57% సంపద చేరింది.అత్యంత పేదరికంలో ఉన్న 50 శాతం ప్రజల వద్ద కేవలం ఆరు శాతం సంపద ఉన్నది.అంటే కేంద్ర ప్రభుత్వం సామాన్యుల ప్రయో జనాలను ఫణంగా పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తుందని,
కార్మికులను బానిసత్వంలోకి నెట్టె నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని,సంక్షేమ బోర్డుకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయిం చాలని,1996 చట్టాన్ని తొలగించకుండా అమలు చేయాలని.ఓ హెచ్ ఎస్ కోడ్ 2020లో కలుప వద్దని.పెంక్షన్ అమలకు కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్ ను కేటా యించాలని,నిర్మాణం రంగం లో వాడే ముడి సరుకుల ధరల పై'జిఎస్టి' తొలగించాలని ఆశ,
అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం 26 వేల రూపా యాలు ఇవ్వాలని,రాష్ట్ర ముఖ్యమంత్రి 2020 మార్చి 9న అసెంబ్లీలో కాంట్రాక్ట్ కార్మికులను పర్మిట్ చేస్తామని ప్రకటించిన విధంగా గ్రామ పంచాయతీలోని కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా ఉద్యోగ భద్రత కల్పిం చాలని,పర్మినెంట్ చేయాలని అన్నారు.ఈ యొక్క సమ్మెకు వందలాది రైతు సంఘాలతో పాటు కిసాన్ మోర్చా ఎస్ కె యం కూడా మద్దతు ప్రకటిం చిందన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎండి నాసర్,తూముల నరసింహా రావు,వెల్దండి కొమురయ్య,
భవన కార్పెంటర్,తాపీ మేస్త్రి సంఘం నాయకులు నాయకులు కడివెండి నరసిం హాచారి,కామేశ్వరచారి,గోసంగి రాంబాబు,ఎండి సర్వర్,బట్టు వెంకటేశ్వర్లు,కూలీ సంఘం నాయకులు నాయని కృష్ణ,
అంగన్వాడి నాయకులు నాగలక్ష్మి,అనసూర్య,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకన్న,
జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అయూబ్ ఖాన్,మండల ఉపాధ్యక్షుడు ఎండి రియాజ్, వావిలాల ఎల్లయ్య,ఎంపిటిసి వావిలాల నర్సింగరావు,
ముక్కెర లాలయ్య,జాడి రాంబాబు,వైస్ ఎంపీపీ బోల్లె భాస్కర్,జిల్లా నాయకులు ఎండి ఖలీల్,ఎంపీటీసీ గుండ్ల శ్రీలత దేవేందర్,కే రాధిక,
శ్రీనివాస్,నరేందర్,వసంత శ్రీనివాస్,జి.నవీన్,పడిదల హనుమంతు,సత్యం,వీరయ్య,మాధవ్,లక్ష్మయ్య,నాగమణి,మానస,రమేష్,రామయ్య,కుమార్ స్వామి,రాజబాబు,శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: