ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఐ.ఎఫ్.టి.యు నాయకులు ఆర్. మధుసూదన్ రెడ్డి, ఎం. నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో మణుగూరు లో ప్రదర్శన నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మణుగూరు ఏరియా లో అన్ని రంగాల కార్మికులు సమ్మెలో పాల్గొని మొదటి రోజు సమ్మెను విజయవంతం చేశారని అన్నారు. ఇదే స్ఫూర్తితో 29న జరిగే సమ్మెను గూడా జయప్రదం చేయాలని కోరారు. ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను చూసైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు మణుగూరు ఏరియా నాయకులు ఎండీ. గౌస్, మంగీలాల్, రాజేందర్, సంజీవరావు, ఎం. రామయ్య, గురుమూర్తి, బాలరాజు, నర్సయ్య, భాను, వెంకటేశ్వర్లు, రామనాథం, నాగేశ్వరరావు, తిరుపతి, రాములు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: