CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నది తీర ముంపు కుటుంబాలకు ఇంటి స్థలాలు కేటాయించాలి.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.


మంగపేట మండలం పొదుమూరు గ్రామంలో గోదావరి ముంపు ఎస్సి,బీసీ, కుటుంబాలకు ఇంటి స్థలాలు కేటాయించాలి అని దళిత నాయకులు దాసరి ఎల్లయ్య, గుగ్గిళ్ల సురేష్ ఆధ్వర్యంలో మంగపేట తహసీల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.తమ గోస చెప్పుకోవడం కోసం గోదావరి నది తీర ప్రాంత ఎస్సి, బీసీ కుటుంబాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఈ సందర్బంగా ప్రజలు తమ బాధలను వివరించారు.గోదావరి వచ్చినప్పుడు ఇంతకు ముందు ఉన్న తహశీల్దార్ బాబ్జిప్రసాద్ తో కూడా విన్నవించారు, స్వయంగా తహసీల్దార్ వచ్చి చూశారు అదే విదంగా ములుగు జిల్లా కలెక్టర్, మంత్రులు రాజకీయ నాయకులు ప్రజల బాధలు కూడా చూడడం జరిగింది. గోదావరి వచ్చినప్పుడల్లా ముంపు ప్రజలను తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్ లో ఉంచడం జరుగుతుంది, అలా కాకుండా మాకు ఇంటి స్థలాలు ఇప్పించి మమ్ములను సురక్షిత ప్రాంతానికి తరలించి ఆదుకోవాలని కోరుకుంటున్నాము అని ముంపు ప్రాంత ప్రజలు తెలియజేశారు. గోదావరిలో వందల ఎకరాల భూమి కొట్టుక పోయాయి గత 2015 సంవత్సరం నుండి పొదుమూరు గ్రామ ప్రజలు వర్షకాలం వస్తే విపరీతంగా వరదలు వచ్చి నెలల తరబడి ఎక్కడో ఉండాల్సిన దుస్థితి.మాకుఇప్పటికైనా శాశ్వతం సరైన పరిష్కార మార్గం చూపించాలని ప్రజలు కోరారు.ఈ కార్యక్రమం లో గుగ్గిళ్ల సురేష్, దాసరి ఎల్లయ్య ముంపు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: