CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దేవ నగరంలో సిసి రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎంపీపీ.

Share it:

 



మన్యం మనుగడ, పినపాక


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సింగిరెడ్డి పల్లి గ్రామపంచాయతీ లోని దేవనగరం గ్రామంలో శ్రీ సమ్మక్క సారక్క దేవాలయం వద్దకు ఐదు లక్షల వ్యయంతో సి సి రోడ్డు నిర్మాణానికి పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక సమ్మక్క, సారక్క దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఎంపిపి గుమ్మడి గాంధీ మాట్లాడుతూ, గ్రామాలను అభివృద్ధి చేయడమే టిఆర్ఎస్ పార్టీ ముఖ్య లక్ష్యం అని, దానికి అనుగుణంగానే పార్టీ పని చేస్తుందని, పినపాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఎంపీటీసీ కాయం శేఖర్, సింగిరెడ్డి పల్లి సర్పంచ్ లక్ష్మి రూపవతి, ఉప సర్పంచ్ పొనగంటి వెంకటేశ్వర్లు, అమరారం పంచాయతీ సర్పంచ్ మొగలి పల్లి నరసింహారావు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వడ్లకొండ శ్రీను, బొడ్డు హరిబాబు, చిన్నారి, గణేష్, కొర్సా రామయ్య,సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: