CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అధికారులను సన్మానించిన దుమ్ముగూడెం టిఆర్ఎస్ మండల నాయకులు,ప్రజాప్రతినిధులు..

Share it:

 



మన్యం టివి దుమ్ముగూడెం::

ములకపాడు క్రీడ మైదానంలో భద్రాచలం ఐ టి డి ఎ ,పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో మండలంలోని గిరిజన యూతకు వాలీబాల్ కిట్లను అందజేయుటకు విచ్చేసిన పి ఓ గౌతమ్ ,భద్రాచలం ఏఎస్పి రోహిత్ రాజు టిఆర్ఎస్ పార్టీ గిరిజన నాయకులు, దుమ్ముగూడెం మండల కమిటీ ప్రజాప్రతినిధుల అద్వర్యంలో శాలువా తో సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు అన్నె సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ గ్రామీణప్రాంతంలో యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా ఉండే అందుకు చదువుతో పాటు గా క్రీడా రంగం లో రాణించాలద్దేశం తో అధికారులు వాలీబాల్,క్రికెట్ వంటి ఆటలకు సంబంధించిన పరికరాలను అందించటం యువత ఉద్యోగ రంగాలలో రాణించుటకు కోచింగ్ సెంటర్లు ప్రారంబించటం వంటి కార్యక్రమాలు చేయటము ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటం లో అధికారులు చేస్తున్న కృషికి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మీ, జెడ్ పి టి సి తెల్లం సీతమ్మ,పార్టీ మండలకార్యదర్శి కణితి రాముడు, ఉపాధ్యక్షులు తునికి కామేష్, ఎంపిటిసిలు మడకం రామారావు, బీమారాజు , మండల నాయకులు కణితి లక్ష్మణ్, కెల్లా శేఖర్ తదితర లు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: