గుండాల మార్చి 27(మన్యం మనుగడ) కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకాన్ని తెచ్చి ఆడపిల్లలకు కొండంత భరోసాను ముఖ్యమంత్రి కెసిఆర్ భరోసాను ఇచ్చినారు అని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం మండలంలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన గత సంవత్సరం పెళ్లి చేసుకున్న మంజూరైన షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాల ద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులకు మనోధైర్యం వచ్చిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో పథకాలు అమలు అవుతున్నాయి ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రంగు రమేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: