CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మోడీ సర్కార్ ఆర్థిక విధానాలతో సామాన్యుడి బ్రతుకులకు బారం.--:ఎంపీపీ రేగా.కాళిక.

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం: కేంద్రంలో మోడీ సర్కార్ ఆర్థిక, పాలనాపరమైన విధానాల ఫలితమే ధరలు, నిరుద్యోగం ఎక్కడ చూసినా నేడు సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడిందని కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో జాతీయ సార్వత్రిక సమ్మె మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సమ్మెలో గ్రామపంచాయతీ, అంగన్వాడి,మధ్యాహ్న భోజన కార్మిక రంగాలు సమ్మెలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ ,కాంగ్రెస్ పార్టీలు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ రేగా కాళిక మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లుగా మోడీ సర్కార్ ఆర్థిక ,పాలనాపరమైన విధానాల ఫలితంగానే నేడు ఈ పరిస్థితి ఎదురైందని అన్నారు.నేడు సామాన్యుడు బ్రతక లేని పరిస్థితి ఏర్పడిందని కేంద్ర ప్రభుత్వ విధానాల్లో సమూల మార్పులు రావాలని కార్మిక, కర్షక ఐక్యత సాధించాలని వారు పిలుపునిచ్చారు.బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం లభించి 75 ఏళ్లు అయిన సందర్భంగా మోడీ సర్కార్ బిజెపి నాయకులు గొప్పగొప్ప మాటలతో దేశ ప్రజల్ని ఊరిస్తూన్నారని దేశంలో అమృతకాలం మొదలైందని పాలకులు ప్రచారం చేసుకుంటున్నారని కుటుంబ ఆదాయం కోల్పోయి కోట్లాది మంది రోడ్డున పడుతుంటే నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరుకుంది .అధిక ధరలతో సామాన్యుడు వణికిపోతుంటే అమృతకాలం ఎలా అవుతుందని వారు అన్నారు.రానున్న కాలంలో కార్మిక ,కర్షక ఉద్యమాలకు టిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశీయ, విదేశీయ కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను రూపొందిస్తుందని వారు విమర్శించారు.బిఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియా,వైజాగ్ స్టీల్ ప్లాంట్ తదితర కంపెనీల అన్నిటిని దేశంలో ఉన్న అన్ని రంగాలను ప్రైవేటీకరీస్తుందని దీన్ని ప్రతిఘటించాలని వారు డిమాండ్ చేశారు. అన్ని రంగాలను ప్రైవేట్ కరిస్తూ దేశాన్ని నిలువునా అమ్ముతున్న కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఈ సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.ఈసమ్మె శిబిరంలో సిఐటియు నాయకులు కాంతారావు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కొంపల్లి రామలింగం, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగబండి వెంకటేశ్వర్లు,బైరిషెట్టి రామారావు,సమ్మెలో పాల్గొన్న కార్మిక శ్రేణులు ఇళ్లందుల పిచ్చయ్య,భవాని,సుజాత, సావిత్రి,పెంటమ్మ, సాంబశివరావు,మోడెం. సంజీవ కుమార్,ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: