CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మండల అభివృద్ధి అధికారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐటీడీఏ పీవో కు వినతిపత్రం అందచేసిన ప్రజా ప్రతినిధులు..

Share it:

 



మన్యం టివి దుమ్ముగూడెం::

గిరివికాస్ పధకం, ట్రైకార్ ఋణాలు అమలులో ఏకపక్షంగా తన ఇష్టానుసారంగా దుమ్ముగూడెం మండల అధికారి వ్యవహరిస్తున్నారని ఐటిడిఎ పిఓ కి టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పిర్యాదు చేశారు గిరివికాస్ పథకం లోభాగంగా మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన గిరిజన రైతులకు 3 పేజ్ విద్యుత్ కోసం ధరకాస్తులు తీసుకోవాల్సి ఉండగా ప్రోగ్రెస్ లో ఉన్న 33 గ్రామాల వారి దరఖాస్తులు మాత్రమే తీసుకుంటూ,మిగతా గ్రామాల వారిని వెనక్కి పంపిస్తున్నారని,ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుకార్చుతున్నారని,గిరిజన యువత అభివృద్ధి కోసం ట్రైకార్ ద్వారా మంజూరైన రుణాలను వారు ఆన్లైన్ చేసుకున్న యూనిట్ కాకుండా వారిని పథకం రద్దు చేస్తానని బెదిరించి బలవంతంగా వారి యూనిట్ ను మార్పించి 1.5 లక్ష రూపాయల చిన్న ఋణాలుగా మార్చి మంజూరి చేస్తున్నారని ఆయనపై తక్షణమే విచారణ జరిపి గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు.ఈ సందర్భంగా ఐ టి డి ఎ పివో మాట్లాడుతూ ఎంపీడీవో అధికారిపై విచారణ చేపట్టి తగు చర్యలు చేపడతామని అలానే అన్నిగ్రామల రైతులకు గిరివికాస్ పధకం వర్తిస్తుందని,ప్రోగ్రెస్ లో ఉన్న 33 గ్రామాలతో పాటు అన్ని గ్రామాల రైతులవద్ద ధరకాస్తులు తీసుకునేలా చూస్తానని,ట్రైకార్ రుణాలు మంజూరైన యూనిట్లనే గ్రౌంటు చేయాలని వాటిపై విచారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం జడ్పిటిసి తెల్లం సీతమ్మ, ఎం పి పి రేసు లక్ష్మి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యాలు, కార్యదర్శి కనితి రాముడు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: