మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని మండల పరిషత్ కార్యాలయం లో ఎంపీపీ కారం.విజయ కుమారి ఆధ్వర్యంలో నీటి పొదుపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వేసవి కాలంలో ఎండల తీవ్రత అధికంగా ఉండడం వలన,నీటిని జాగ్రత్తగా పొదుపు చేయాలని, ఇదే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని,ఎంపీపీ విజయకుమారి తెలిపారు. నీటిని అత్యంత విలువైన వనరుగా భావించి,భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా కాపాడుకోవాలని తెలియజేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ కారం.విజయ కుమారి నీటిని సంరక్షిస్తామని,అలాగే పొదుపుగా వినియోగిస్తామని, వృదా చెయ్యమని,మండల అధికారులు,ప్రజా ప్రతినిధుల తో కలిసి జల ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీరబాబు,ఎంపిఓ వెంకటేశ్వర్లు,ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి గుడిపూడి.కోటేశ్వరరావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, పంచాయతీ ల సర్పంచులు, సెక్రటరీలు తదితరులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: