CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మంగపేట మండల వర్కింగ్ జర్నలిస్ట్ ల సంక్షేమ సంఘం సమావేశం.

Share it:

 



మన్యం మనుగడ, మంగపేట.

తేది 27.03.2022 ( ఆదివారం ) న సీనియర్ జర్నలిస్టు ఎండి.ఇషాక్ అధ్యక్షతన రాజుపేట రైతు వేదిక భవనంలో మంగపేట మండల వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండలంలోని జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమం, భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది. అనంతరం సమావేశానికి హాజరయిన జర్నలిస్టుల ఏకాభిప్రాయం మేరకు పలు అంశాలపై తీర్మానాలు చేయడం జరిగింది. వ్యక్తిగత, అనివార్య కారణాల వలన సమావేశానికి హాజరుకాలేకపోయిన జర్నలిస్టులు వడ్లకొండ వీరయ్య, అక్కపెళ్లి రాజేష్, చిలకమర్రి వేణు, ఉగ్గుమల్ల గణేష్, జానపట్ల జయరాజ్ లు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని ఫోన్ ద్వారా తమ అభిప్రాయాలు తెలియచేశారు. అనంతరం మంగపేట మండల వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ సంఘం నూతన కమిటీని సమావేశానికి హాజరయిన జర్నలిస్టుల ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

మంగపేట మండల వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ సంఘం నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా కటుకూరి సాంబశివరావు ( న్యూస్ 10 ), ముఖ్య సలహాదారులుగా వడ్లకొండ వీరయ్య ( ఏబిఎన్ ), అధ్యక్షులుగా కల్లెబోయిన శ్రీనివాస్ ( ఎచ్ఎం టీవీ ),ప్రధాన కార్యదర్శిగా మేడా ఆదినారాయణ, (మనం న్యూస్), ఉపాధ్యక్షులుగా పల్లపు రమేష్ ( వి 6) , కోశాధికారిగా పొలసాని శ్రీనివాసరెడ్డి ( ప్రజాజ్యోతి )లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పూర్తి స్థాయి కమిటీని త్వరలో జరగనున్న సమావేశంలో ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా తీర్మాణం చేయడం జరిగింది. ఈ సమావేశంలో జర్నలిస్టులు కల్లెబోయిన శ్రీనివాస్, మేడా ఆదినారాయణ, ఎండి.ఇషాక్, కటుకూరి సాంబశివరావు, పల్లపు రమేష్, పొలసాని శ్రీనివాసరెడ్డి, కురిమిళ్ళ శ్యామ్, ఇప్పలపెళ్లి రమేష్, నల్లూరి మాధవ శ్రీనివాసరావు, అక్కపెళ్లి నరేష్, ఇప్పాల నరేష్, చెట్టుపల్లి స్నేహ కుమార్, కోడం నరేష్, ఈసంపెల్లి సురేందర్, మైప శంకర్, శివనేని మహేష్, బోడ ప్రవీణ్ కుమార్, ఎస్కే.అజారుద్దీన్, వై.శ్రావణ్, పొలూరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: