మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సింగిరెడ్డి పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మద్దులగూడెం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మద్దుల గూడెం గ్రామంలో ప్రధాన రహదారికి ఇరువైపులా సర్పంచ్ కొర్సలక్ష్మి రూపవతి ఆధ్వర్యంలో కొత్త పైప్ లైన్ పనులు ప్రారంభించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పొనగంటి వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్, వార్డు సభ్యులు జామ సుశీల, పండ ముక్తేశ్వరరావు, గుండెబోయిన ఎల్లయ్య, గ్రామ పెద్దలు పాల్గొన్నారు
Post A Comment: