CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏజెన్సీ లో రేజింగ్ కాంట్రాక్టర్లుకు అనుమతిలేదు.

Share it:

 



మన్యం మనుగడ వాజేడు : 

ప్రభుత్వ ఇసుక రీచ్‌ల వద్ద రోజుకు లక్షల రూపాయల ఇసుక అక్రమంగా తరలి వెళ్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు. అక్రమ రవాణాను నిరోధించాల్సిన సంబంధిత అధికారులు నిద్రావస్థలో ఉంటున్నారనే ప్రజల వాదనను కొట్టివేయలేని పరిస్థితి.ఇసుక లారీలు సామర్థ్యానికి మించి వెళ్తున్నా.. పట్టించుకునే నాధుడు కరువయ్యారు.తనఖీలు చేయాల్సిన మైనింగ్, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నామమాత్రం తనిఖీల తోనే సరిపెడుతున్నారు. సొసైటీ క్వారీల నుంచి అక్రమ రవాణాకు ఆజ్యం పోస్తోంది. ఇదిలా ఉండగా ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన అధికారుల నిత్య పర్యవేక్షణలో కొనసాగాల్సి ఉండగా ప్రస్తుతం సంబంధిత అధికారులు కొసమెరుపుగా దాడులు నిర్వహిస్తుండడంతో..రేసింగ్ కాంట్రాక్టర్ల అడ్డులేకుండా వ్యవహరిస్తున్నారని గ్రామాలలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎడుజలపల్లి గ్రామపంచాయతీ బొమ్మనపల్లి సొసైటీ ఇసుక రీచ్ లో పీసా గ్రామసభలు పెట్టేముందు అందరికీ ఉపాధి కల్పిస్తామని తీరా ఇసుక రీచ్ లు, ప్రారంభమై పక్షం రోజులు అవుతున్నా ఇప్పటివరకు పని కల్పించకపోగా కులం పేరుతో దుర్భాషలాడుతూ ఉన్నారని, గ్రామస్తులు తహాసిల్దార్ అల్లం రాజ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. అలాగే ఇసుక రీచ్ల వద్ద రాత్రి పగలు తేడా లేకుండా జెసిబి యంత్రాలతో ఇసుక తోడు తిన్నారా..గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు తహాసిల్దార్ ను కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: