CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన,పెట్రోల్,డీజిల్,గ్యాస్ నిత్యావసరాల ధరలు తగ్గించాలి.

Share it:

 



  • కరెంట్,బస్సు ఛార్జీలు తగ్గించాలి.
  • ఏటూరునాగారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.
  • ఏటూరు నాగారం మండల అధ్యక్షులు చిటమట రఘు.

మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి సూచన మేరకు మండల కేంద్రము లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు చిటమట రఘు,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య మాట్లాడుతూ.పేట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు పెంచి సామాన్య మానవుడు పై పెను భారం మోపడం తోపాటు ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలు విద్యుత్ ఛార్జీల మోత ఆర్టీసీ ఛార్జీల మోత వరి అంటే ఊరి పేరుతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు హైడ్రామా ఆడుతున్నాయని, పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు ఒకేసారి పెంచడం ప్రజలపై ప్రభుత్వాలు అధిక భారం మోపుతున్నాయి అని అన్నారు.ఒక సిలిండర్ పై 50 రూపాయలు పెరగడంతో సిలిండర్ ధర 1050 రూపా యాలు అయిందని 8 పెంచి 110 రూపాయలు కావడం వలన ప్రజల పై అత్యధిక భారాన్ని మోపుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 350 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని మహిళలకు గ్రూపుల ద్వారా గ్యాస్ పొయ్యిలు సిలిండర్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.గ్యాస్ కొనలేక మళ్ళీ కట్టెల పొయ్యి పై వండుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను నిత్యావసర ధరలు తగ్గించి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తు న్నామని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ చార్జీలను ప్రజలపై మోపి ఓవర్ లోడ్ పేరుతో ప్రజలపై భారాన్ని పెంచడం ఇప్పటికే కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారని పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని అలాగే ఆర్టిసి బస్సు చార్జీలను తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని, రాష్ట్రంలో వరి వేస్తే ఊరే అని రైతులను నాశనం చేస్తున్నారని ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నాటకాలు ఆపి రాష్ట్ర ప్రజల పండించిన పంటను కొనేలా రెండు ప్రభు త్వాలు సహకరించాలని లేనియెడల రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య,జిల్లా మైనార్టీ నాయకులు ఖలీల్ ఖాన్,మాజీ మండల అధ్యక్షులు,మాజీ ఎంపిటిసి వావిలాల నర్సింహారావు,జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గౌస్,ఎస్టీసెల్ మండల అధ్యక్షులు చేల వినయ్,ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి కొండగొర్ల పోషలు, టౌన్ అధ్యక్షులు తాళ్లపల్లి నరేందర్,గడ్డం మహేష్,

ఇర్శవడ్ల కిరణ్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వసంత శ్రీనివాస్ యాదవ్,యూత్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు గద్దల నవీన్,ముక్కెర లాలయ్య,చింతకింది రాజు, శంక రాజ్ పల్లి అద్యక్షుడు ప్రవీణ్,టౌన్ యూత్ అధ్యక్షులు బండారి లక్కీ,ప్రధాన కార్యదర్శి అజ్మత్,ముస్తఫా,లక్ష్మణ్,గణేష్ సరికొప్పుల శ్రీనివాస్,హను మంత్,మానస,రాధిక,భాగ్య,

సద్దాం,శేఖర్,పోశయ్య,సునీల్, విక్రమ్,వాసు,జీవన్,రమేష్ శ్రావణ్,ఈసం జనార్ధన్,

ప్రశాంత్ శివ,మనోజు,పెద్ది రాజబాబు,ఏంపెళ్ళి ప్రకాష్,

మోతే మలేశ్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: