CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏసీబీ వలలో చిక్కిన ఏఈ ఓ..

Share it:

 


మన్యం మనుగడ : జూలూరుపాడు, మార్చి 30, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని పాపకొల్లు క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారి గా విధులు నిర్వహిస్తున్న బెజవాడ మణికంఠ బుధవారం పాపకొల్లు రైతు వేదికలో బానోత్ కళ్యాణ్ అనే గిరిజన రైతు నుండి 15000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. భానోత్ సుగాలి అనే గిరిజన మహిళ రైతు ఇటీవల చనిపోవడంతో రైతు బీమా వర్తింపు కొరకు లంచం డిమాండ్ చేయగా, భానోత్ కళ్యాణ్ ఏసీబీ ని ఆశ్రయించినట్లు తెలిసింది. ఏకకాలంలో సుజాతనగర్ లోని మణికంఠ నివాసముంటున్న గదిలో, అదేవిధంగా మణికంఠ స్వగ్రామమైన అశ్వారావుపేట లో దాడులు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.

Share it:

TS

Post A Comment: