CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రజావాణి పెండింగ్ లో ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలి.

Share it:

 



  • సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య.

మన్యం మనుగడ ఏటూరు నాగారం

సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం పెండింగ్ అర్జీలను సత్వరమే పరిష్కరిం చాలని జిల్లా కలెక్టర్ ఐ టి డి ఎ ఇంచార్జి ప్రాజెక్టు అధికారి ఎస్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు.సోమవారం ఐటీడీఏ కార్యాలయం లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య హాజరై ప్రజల నుండి నేరుగా దరఖాస్తులను స్వీకరించారు.దాదాపు నలభై ఐదు దరఖాస్తులు ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను ఎండార్స్ చేసి సంబంధిత శాఖ అధికారులకు ఫార్వర్డ్ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అటెండెన్స్ యాప్ ద్వారా అటెండెన్స్ తప్పని సరి అని, 3 రోజుల కంటే ఎక్కువ గైర్హాజరు ఉన్న వారికి షోకాజ్ నోటీస్ సర్వు చేయాలని,గతవారం పెండింగ్ అర్జీలను సత్వరమే పరిష్కరిం చాలని అధికారులను ఆదేశిం చారు.ప్రజావాణి కార్యక్రమం నిర్వాహణలో జిల్లా అధికారుల హాజరు తప్పనిసరి అని ప్రజల నుండి వచ్చిన విజ్ఞాపనలను పెండింగ్లో ఉంచరాదని సూచించారు.అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఫైల్స్ మూమెంట్స్ అంతా ఈ ఫైలింగ్ ద్వారా ఉండాలని ,ఫైల్స్ పెండింగ్ లో ఉండరాదని జిల్లా కలెక్టర్ అన్నారు.మంగపేట,ఏటూరు నాగారం,కన్నాయిగూడెం, వెంకటాపురం,వాజేడు మండలాలలో సాంకేతిక పరమైన సమస్యలు ఉంటే ప్రత్యేక అధికారులు దృష్టిసా రించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

ముఖ్యంగా త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని మంగపేట గోదావరి పరివాహక ప్రాంతంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని మంగపేటలో ఎక్కడైతే సమ స్యలు ఉన్నవో నివేదికలు సమర్పించాలని,వాటికి బోర్ల మంజూరు చేస్తామని,ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్నారు.ప్రతి మండలంలో ఇట్ర గ్రీడ్ పైప్ లైన్ వివరాలు, ఎగ్జిస్తింగ్ పైప్ లైన్ వివరాలు, ఏతైన ప్రదేశాలలో నీటి సరఫరా లేనట్లు అయితే వాటి వివరాలు మండలాల వారిగా నివేదికలు తయారు చేసి ఇవ్వాలని,నివేదికల ఆధారంగా పనులు చేపట్టడం జరుగుతుం దని వారు అన్నారు.ఐటిడిఏ పరిధిలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని అన్నారు.

గ్రామాల వారీగా పాగింగ్ మిషన్లు ఎన్ని ఉన్నాయి,వాటి ద్వారా రోజు దోమల నివార ణకు ఉపయోగించి వాట్స్ ఆప్ గ్రూప్ ద్వారా ఫోటోలో అప్లోడ్ చేయాలని ఎంపిఓ లను అదేశించారు.సామ్ మామ్ పిల్లల వివరాలు సేకరించి పౌష్ఠిక ఆహారం లోపం ఉన్న వారు పిల్లలకి పౌష్ఠిక ఆహారం ఇచ్చేలా చూడాలని,ఈ వివ రాలు ఎప్పటికప్పుడు వాట్స్ ఆప్ గ్రూప్ ద్వారా ఫోటోలు అప్లోడ్ చేయాలని అన్నారు.

దివ్యాంగుల పెన్షన్,వృద్ధాప్య పింఛన్లు,ఔట్ సోర్సింగ్ జాబ్ పైన దరఖా స్తులు వచ్చాయని వాటిని సంబంధిత అధికారుల తో మాట్లాడి దరఖాస్తు దారుని కి వివరించాలని వారు అన్నా రు.కంపాషణేటరీ గ్రౌండ్ లో దరఖాస్తులు ఉన్నట్లు అయితే వాటిని త్వరిత గతిన పూర్తి చేయాలని వారు అన్నారు.

గుడుంబా నియంత్రణ కోసం ఎక్సైజ్ శాఖ నిత్యం పర్యవే క్షణ చేయాలని నిర్మూలించ డానికి తగిన చర్యలు చేపట్టాల ని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు.

మన ఊరు మన బడి కార్యక్రమంలో బడులకు మహర్ధశ వచ్చిందని వాటి వివరాలు సేకరించి ఏదైతే మరమత్తులు చేయవలసిన బడులను గుర్తించి మరమ్మ తులు చేయించాలని,వాటికి ఐటిడిఏ పరిధిలోని ఇఇ ఆధ్వర్యంలో పనులు చేపట్టడం జరుగుతుందని వారు అన్నారు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మరమ్మ తులు చేయవలసిన అవసరాల ఉన్న వాటిపై వివరాలను సేకరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ వై వి గణేష్,డిఆర్ఓ రమాదేవి, ఐటిడిఎ ఏపిఓ వసంతరావు, ఐటిడిఏ ఏఓ దామోదర్ స్వామి,ఎస్సీ కార్పొరేషన్ ఇడి తూల రవి,జిల్లా వెటర్నరీ అధికారి విజయ భాస్కర్, సంక్షేమ శాఖ అధికారి ప్రేమ లత జడ్పీ సీఈఓ రమాదేవి షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి పి భాగ్యలక్ష్మి ఈఈ హేమలత సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: