CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముగిసిన గురూజీ రాంబాబు యోగ క్యాంప్.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట:

ములుగు జిల్లా చిన్నబోయినపల్లి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ హాస్టల్లోగురూజీ యోగి రాంబాబు చే నిర్వహించిన యోగ అయిదు రోజుల యోగ క్యాంపు ముగిసింది. ఈ కార్యక్రమం లో ప్రాణాయామం, ఫుడ్ అండ్ స్పిరిట్యుయల్ సైన్స్ త్రు పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫ్రీ అవేర్నెస్ యోగ క్యాంపు బుధవారం ముగిసింది. ఈ కార్యక్రమం ఐటీడిఏ వారి సహకారం తో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా గురూజీ యోగి రాంబాబు మాట్లాడుతూ యోగ అనేది మూడునుండి అయిదు రోజుల వ్యవది లో జరిగే పది గంటల కార్యక్రమం యోగ అనేది ఆరోగ్యకరమైన శక్తిని పుంజుకొనే సులభతరమైన మరియు కష్టతరంతో కూడుకున్నటువంటి శ్వాస ప్రక్రియ.దీని ద్వారా శారీరక, మానసిక సమతౌల్యం ఏర్పడుతుంది.యోగ అందరూ చేసుకోవచ్చు కాకపోతే ముందుగా గురువు దగ్గరనుండి విది విధానాలు నేర్చుకొని గురువుల సలహాలు పాటిస్తూ ఇంట్లో కూడా యోగ అనుసరించవచ్చు.దీని ద్వారా దీర్ఘకాలికమైన రోగాలనుండి కూడా విముక్తి పొందవచ్చు,యోగ రోజు సాధన చేసుకొనే వారి జీవన విధానంలో ఊహించని మార్పులు మనం గమనించవచ్చు.యోగ సాధన చేసే వారు ఆరోగ్యంగా ఉల్లాసంగా నిండు నూరేళ్లు జీవించవచ్చు అని గురూజీ తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: