మన్యం మనుగడ, పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపినపాక మండలం వెంకట్రావుపేట గ్రామ ఉప సర్పంచ్ బట్టా నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం మణుగూరులో తెలంగాణ ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో ఉప సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వెంకట్రావు పేట గ్రామ అభివృద్ధే ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఉప సర్పంచ్ బట్టా నాగేశ్వరరావు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో కంపెర్ల ప్రసాద్, బట్టా రమాదేవిలు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి,ఎంపీపీ గుమ్మడి గాంధీ,టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంచర్ల వెంకటేశ్వర్లు, దర్రాజు కృష్ణ, వార్డు మెంబర్ తాండ్ర బాలక్రృష్ణ, పొనగంటి ప్రమోద్, పొనగంటి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: