CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి దేశాన్ని పోనీ వద్దు :-ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు వై వెంకన్న.

Share it:

 


గుండాల మార్చి 29(మన్యం మనుగడ) కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి దేశాన్ని పోనీ ఇవ్వవద్దని ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు వై వెంకన్న అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను కుదించి 4 గు లేబర్ కోడ్లు చేసిందన్నారు దీని వల్ల కార్మికులు సమ్మె చేసే హక్కు కోల్పోయారని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుందన్నారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా నే ఈ సమ్మె చేసినట్టు వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా మోడీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలనుఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డం నగేష్ , బాల్య కిరణ్, చింత నరసన్న తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: