CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చిలకలగండి ముత్యాలమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో శ్రీశ్రీశ్రీ చిలకల గండి ముత్యాలమ్మ వారి దేవస్థానం 47 వ వార్షికోత్సవ మరియు జాతర మహోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పాల్గొని అమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటి మాట్లాడుతూ చిలకల గండి ముత్యాలమ్మ వారి దేవస్థానంకు అనాది నుండి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని, లక్షలాది మంది భక్తులు ఈ ప్రాంతం నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా అమ్మవారి దర్శనార్థం జాతర మహోత్సవంకు వస్తుంటారని, ఈ దేవస్థానం దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ అంకిత మల్లికార్జున్ రావు, సుంకవల్లి వీరభద్రరావు, పొట్ట రాజులు, బీర్రం వెంకటేశ్వరరావు, ప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: