CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పేదలకు సేవ చేయడం అదృష్టం.--:ఏడూళ్ల బయ్యారం సీఐ రాజ గోపాల్.

Share it:

 


  • ప్రాణిక్ హీలింగ్ ఆధ్వర్యంలో వలస ఆదివాసీలకు దుస్తులు పంపిణీ

మన్యం మనుగడ కరకగూడెం:సమాజంలోని నిరుపేదలకు సాయం చేయడాన్ని ప్రతీ ఒక్కరూ అదృష్టంగా భావించి వారికి ఏదో రూపంలో సాయపడాలని ఏడూళ్ల బయ్యారం సీఐ రాజ గోపాల్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని వలస ఆదివాసీ గ్రామలైన చింతలపాడు,రేగళ్ల గ్రామస్థులకు ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సికింద్రాబాద్ వారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులు కరకగూడెం గ్రామీణ వైద్యుదు షేక్ సోందుపాషా సమక్షంలో సీఐ చేతుల మీదుగా 60 కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రతిఒక్కరి మదిలో సేవ చేయాలని ఆలోచన ఉన్నా వచ్చిన ఆలోచనను అమలు చేస్తేనే సార్థకత లభిస్తుందని అది ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ చేసి చూపిస్తున్నదని అన్నారు.అంతేకాకుండా ప్రజల అవసరాలను గుర్తించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడమే తమ ఫౌండేషన్ లక్ష్యంమని ఫౌండేషన్ సభ్యులు షేక్ సోందుపాషా తెలిపారు. కార్యక్రమంలో కరకగూడెం ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్, పోలీసు సిబ్బంది,ఫౌండేషన్ సభ్యులు షేక్ వసీం అక్రమ్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: