- - రెవిన్యూ సిబ్బంది దాడులు..!!
- - పట్టుబడ్డ జేసీబీ, ట్రాక్టర్లు..
- - తెల్లారేసరికి కనిపించని వైనం..
- - దొంగలకి సద్దులు మోస్తున్నది ఎవరు..?
*మన్యం మనుగడ : జూలూరుపాడు, మార్చి 28, భద్రాద్రికొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు, మండల పరిధిలోని రాజారావుపేట గ్రామ శివారు సీతారామ ప్రాజెక్ట్ కాలవ మట్టిని కొంతమంది అక్రమార్కులు ఆదివారం అర్ధరాత్రి వేళలో సుమారు 11. 30 గంటల సమయంలో అక్రమంగా మట్టి తోలకాలు జరుగుతున్నాయనే సమాచారముతో పాపకొల్లు గ్రామంలోని గ్రామ రెవెన్యూ సహాయకులు తమ ప్రణాలకు తెగించి అకస్మిక తనిఖీ, చేయగా, సీతారామ ప్రాజెక్ట్ కాలవ వద్ద అనుమతి లేకుండా అక్రమ మట్టి తోలకాలు జరుపుతూ పట్టుబడిన ట్రాక్టర్లు, ఒక జే.సి.బి వాహనాలను రెవెన్యూ సహాయకులు సిద్దా, వెంకటేశ్వర్లు, రామారావులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న ట్రాక్టర్లు, జేసీబీ స్థానిక రెవిన్యూ కార్యాలయంలో గాని పోలీస్ స్టేషన్ లో గాని కనిపించపోవడంతో స్థానిక ప్రజలు, ఆచార్యనికి గురవుతున్నారు. క్రింది స్థాయి రెవెన్యూ సిబ్బంది అర్ద రాత్రి ఎంతో కష్టపడి పట్టుకున్న వాహనాలు కనిపించక పోవడంతో పై స్థాయి రెవెన్యూ అధికారుల తీరుపై ప్రజలు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. పట్టుబడ్డ వాహనాల ఓనర్లుకు, కొందరు ప్రజా ప్రతినిధుల అండ దండలు ఉండటంతోనే, రెవిన్యూ ఉన్నత అధికారులతో రాత్రికి రాత్రే మంతనాలు జరుపుకొని, గుట్టుచప్పుడు కాకుండా వదిలేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన అధికారులు, ప్రజా ప్రతినిధులు దొంగలకు సద్దులు మోసినట్లు గా వ్యవహరించడం బాధ్యత రహితమని కొందరు భావిస్తున్నారు.
Post A Comment: