మన్యం మనుగడ : జూలూరుపాడు, మార్చి 28,కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా, దేశవ్యాప్తంగా బిజెపి యెతర పార్టీలు చేపడుతున్న సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా, కెసిఆర్ పిలుపుమేరకు, స్థానిక ఎమ్మెల్యే ఆదేశానుసారం, సోమవారం జూలూరుపాడు మండల కేంద్రంలో టిఆర్ఎస్ మరియు టిఆర్ఎస్ కె వి శ్రేణుల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు, ఎంపీపీ లావుడ్యా సోనీ, కాకర్ల ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్, బొజ్య తండా సర్పంచ్ లావుడ్యా కిషన్ లాల్, ఏఎంసి డైరెక్టర్ హలవత్ నరసింహారావు, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు పణితి వెంకటేశ్వర్లు, యువజన అధ్యక్షులు గుగులోత్ చంటి నాయక్, సీనియర్ నాయకులు రామిశెట్టి నాగేశ్వరరావు, వేల్పుల నరసింహారావు, కొండెం జోగారావు, మోదుగు రామకృష్ణ, తోట శ్రీను, బోడ నాగరాజు, ఉబ్బనపల్లి మహేష్, రవి, బోడ బాబులల్, వెంకటనారాయణ, ఆటో యూనియన్ కార్మికులు, హమాలీ వర్కర్స్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: