మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని పేటమాలపల్లి, దొంతికుంట ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుందని, సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతూ అనేకమంది ప్రజలు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, పార్టీ శ్రేణులకు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎల్లవేళలా అండదండగా ఉంటూ కార్యకర్తలను కాపాడుకుంటుందని, ధైర్యంగా పార్టీలో కొనసాగండని అభయ హస్తం అందించారు. పార్టీలో చేరిన వారిలో గొల్లపల్లి నాగ ధర్మరాజు, బంతిపూల కాంతారావు, వెంకన్న బాబు, మందపాటి రవి, బుడిపుడి రవి, అల్లాడి కృష్ణారావు, నర్సింగ్ కార్తీక్,అల్లాడి లక్ష్మణరావు, నందికోల సంతోష్, అల్లాడి బాబి, గారపాటి రాజేష్, అల్లాడి రాజేష్, గంజి రోహిత్, మందపాటి పద్మజ, అల్లాడి సాయి, మందపాటి మహేష్, మందపాటి మంగరాజు, మందపాటి శ్రీను, అల్లాడి అభిషేక్, అల్లాడి రామారావు, కంబరపల్లి చిల్లేశ్వరరావు, షేక్ బాబా, నరానే వెంకట్రావు, సిద్దేశీ అనిల్, మాత్రపు చందు, తొర్లపాటి జోసెఫ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, జెడ్పిటిసి వరలక్ష్మి, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అట్టం రమ్య, మండల అధ్యక్ష కార్యదర్శులు బండి పుల్లారావు, జుజ్జురపు వెంకన్న, రైతు సమన్వయ సమితి కన్వీనర్ జూపల్లి రమేష్, కలపాల శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సత్య వరపు సంపూర్ణ, ఫణీంద్ర, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: