CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చిన్న జీయర్ స్వామి క్షమాపణలు చెప్పాల్సిందే :-గుండాల సర్పంచ్ సీతారాములు.

Share it:

 


గుండాల మార్చి19 (మన్యం మనుగడ) సమ్మక్క, సారలమ్మను అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్న జీయర్ స్వామి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని గుండాల సర్పంచ్ సీతారాములు డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో న్యూ డెమోక్రసీ, ఏ ఎస్ పి, తుడుందెబ్బ ఆధ్వర్యంలో చిన్న జీయర్ స్వామి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం సీతారాములు మాట్లాడుతూ ప్రపంచంలోనే ఆదివాసి వనదేవతల జాతర గా ప్రసిద్ధి చెందింది అన్నారు. అలాంటి సమ్మక్క-సారలమ్మ లను అవమానించేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చిన్న జీయర్ స్వామిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలన్నారు లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి నాయకులు చంద్రయ్య దొర, ఏ ఆరెం వంశి లు బిక్షం, రామారావు, తుడుందెబ్బ నాయకులు వజ్ర ఎర్రయ్య, న్యూ డెమోక్రసీ నాయకులు మంగన్న, తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: