CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కార్మిక - ప్రజావ్యతిరేక, విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం.సమ్మెను విజయవంతం చేసిన కార్మిక వర్గానికి విప్లవ జేజేలు.

Share it:




  • ఉద్యమంతో కేంద్రం మెడలు వంచుదాం

కేంద్ర ప్రభుత్వం కార్మిక - ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని, అందులో భాగంగా కార్మిక చట్టాలను రద్దుచేసి, వాటి స్థానంలో తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు రెండవ రోజు సమ్మెలో భాగంగా మంగళవారం మణుగూరు మండలం, చిక్కుడుగుంట భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ (బి టి పి ఎస్) కార్మికులు, సీఐటీయూ మరియు 

ఐ ఎఫ్ టి యు అనుబంధ బి టి పి ఎస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొన్నారు. రెండవ రోజు సమ్మెలో సిఐటియు నాయకులు శ్రీరామ్ సతీష్, btps కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టి యు) జి నరేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన సమ్మె శిబిరంలో , సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు, మోరా రవి కాంగ్రెస్ నాయకులు పోలమూరి రాజు సంఘీభావంగా పాల్గొని పాల్గొని మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్‌ల అమలుకు పూనుకుందని, వాటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని అన్నారు. సమ్మెను విజయవంతం చేసిన కార్మికులందరికీ విప్లవ జేజేలు తెలిపారు. ఈ లేబర్ కోడ్ లు కార్మికుల అన్ని ప్రాథమిక హక్కులను బలహీనపరుస్తాయని అన్నారు


ఈ లేబర్ కోడ్‌ల ద్వారా దాడికి గురవుతున్న కార్మికుల హక్కులలో యూనియన్‌లను ఏర్పాటు చేసుకునే హక్కుతో పాటు, కనీస వేతనాల చెల్లింపు, సకాలంలో వేతనాల చెల్లింపు, 8 గంటల స్థానంలో 12 గంటల పని దినానికి ఆమోదం, రాత్రి షిఫ్టులలో మహిళలను నియమించుకోవడానికి అనుమతించడంతో పాటు, తాత్కాలిక ఉద్యోగాలు, సాధారణ మరియు కాంట్రాక్ట్ లేబర్, రిట్రెంచ్ స్వేచ్ఛ మరియు ఇతరులలో కార్మిక చట్టాలను అమలు చేసే యంత్రాంగాన్ని పూర్తిగా అణగదొక్కడమేనని అన్నారు. ఈ లేబర్ కోడ్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఆర్టిజన్ సి ఎల్ పోస్ట్ లు ఇవ్వాలని, ప్రతి కార్మికునికి గేట్ పాస్ ఇవ్వాలని, ఈపీఎఫ్ అమలు చేయాలని , కనీస వేతన చట్టం ప్రకారం ప్రతి నెల జీతాలు చెల్లించాలని , డిమాండ్ చేశారు. పారిశ్రామిక కాంట్రాక్ట్ కార్మికులందరికీ సరైన ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సూర్యం రాములు పాషా బి టి పి ఎస్ నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: