CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మాటల్లో జాతీయత ఆచరణలో విధ్వంసం--:ఎంపీపీ రేగ కాళిక.

Share it:

 

 


  • కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి ఏజే రమేష్

మన్యం మనుగుడ కరకగూడెం: బిజెపి ప్రభుత్వం మాటల్లో దేశభక్తి జాతీయత గురించి చెబుతూ ఆచరణలో విధ్వంసకర విధానాలను అవలంభిస్తోందని సహజవనరులు ప్రభు‌త్వరంగ సంస్థలను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తుందని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎజె రమేష్ , ఎంపీపీ రేగ కాలిక ,విమర్శించారు మంగళవారం మండల కేంద్రంలో జరుగుతున్న జాతీయ సార్వత్రిక సమ్మె శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వినాశకర ప్రజావ్యతిరేక జాతీయ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సమరశంఖం పూరించినదని ఈ సమ్మెలో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మనీయమని దేశాన్ని కాపాడుకుంటాం ప్రజలను రక్షించుకుంటాం కార్మిక వ్యతిరేక కోడ్ లను తిప్పికొడతాం సంఘం పెట్టుకుని తీరూతాం అంటూ దేశవ్యాప్త ప్రదర్శనలలో కార్మికలోకం గర్జిస్తూందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.అదే విధంగా దేశంలో సరైన ప్రతిపక్షం లేకపోవడంతో నరేంద్ర మోడీ ఎనిమిదేళ్లుగా తన విధానాలను ముందుకు తీసుకెళ్తున్నారని ఎల్ఐసి బ్యాంకులు రైల్వే తదితర ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ రంగ సంస్థలను ఆమ్మె అధికారం మోడీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని వారు ప్రశ్నించారు.కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారానే వేతన సవరణ సాధించుకోగలం ఈ సందర్భంగా వారు తెలియజేశారు. కార్మిక కోడ్ లను తక్షణమే రద్దు చేయకుంటే కార్మికులంతా కలిసి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెడతారని పరోక్షంగా హెచ్చరించారు కార్పొరేట్లు తమకు వచ్చే లాభాలు ఇచ్చే వాటా దనం తోనే ప్రజలను మభ్యపెట్టి బీజేపీ అధికారంలోకి వచ్చింది అన్నారు అందుకే వారికి అనుగుణంగా పాలన చేస్తుందని వారన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలను ఐక్య పోరాటాలు ద్వారా అడ్డుకొని కార్మికులను కట్టు బానిస గా మార్చే కోడ్ లను తిప్పికొట్టి హక్కులను కాపాడుకుంటామని తెలిపారు కరకగూడెం గ్రామ సర్పంచ్ ఊకె రామనాథం టిడిపి పార్టీ మండల అధ్యక్షులు సిరి శెట్టి కమలాకర్ మాట్లాడుతూ దేశ భక్తి ముసుగులో అధికారంలోకి వచ్చిన బిజెపి కార్పొరేట్ల మేలుకోసం తన భక్తిని చాటుకుంటూ ఉందని విమర్శించారు.దేశ భక్తి పేరుతో దేశ సంపదను కాజేస్తున్నదని దీనికి అడ్డుకట్ట వేసేందుకు కార్మికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా మోడీ సర్కార్ మాత్రం అమలు చేయడం లేదని చట్టాలను కోర్టులను గౌరవించని మోడీ సర్కార్ వెంటనే గద్దె దిగిపోవాలని వారు డిమాండ్ చేశారు.అనంతరం మండల కేంద్రంలో ప్రదర్శన నిర్వహించి తాసిల్దార్ కార్యాలయంలో సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాసరావు కరకగూడెం గ్రామ ఉపసర్పంచ్ రావుల రవి మండల నాయకులు కొమరం కాంతారావు సత్యం నరసింహారావు కార్మిక శ్రేణులు ఇల్లందుల పిచ్చయ్య మోడెం సంజీవ్ కుమార్ గాంధార్ల ధనంజయ్ పెద్దిరాజు భవాని సుజాత రమాదేవి లావణ్య పుణ్యవతి సత్యవతి పెంటమ్మ సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: