మన్యం మనుగడ కరకగూడెం: కరకగూడెం మండల టీడీపీ మండల అధ్యక్షుడు.సిరిశెట్టి కమలాకర్ ఆద్వర్యంలో మండలపరిదిలోని కరకగూడెం.అనంతారం గ్రామాల్లో టీడీపీ 40.వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగోడు ఎక్కడున్నా తెలుగువారి అభ్యున్నతికి పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన అన్నారు.తెలుగుదేశం పార్టీ 40 వసంతాలు పూర్తిచేసుకుని 41 వసంతంలోకి అడుగు పెడుతున్నా ఈ సందర్భంగా పార్టీ మనుగడ కోసం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు.ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు అణగారిన వర్గాల అందలం ఎక్కించిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని ఆయన అన్నారు.రాష్ట్రంలో ఈరోజు కనపడుతున్న అభివృద్ధి తెలుగుదేశం ప్రవేశపెట్టిన అనేక పథకాలు నిదర్శనమని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాయం.లక్ష్మినారాయణ. చందా రాఘవులు.గుండ్ల వీరయ్య.ప్రధాన కార్యదర్శి. చందా మధు.మండల నాయకులు.ఇస్లావత్ రాధాకృష్ణ.ఈసం సత్యనారాయణ.అవుదొడ్డి శ్రీను.శంకరయ్య.చందా పరమయ్య.పెద్ది రాములు.తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: