- అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో పిలుపు.
మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఆదివారం సిఐటియు జిల్లా అధ్యక్షుడు దావూద్ మాట్లాడుతూ.కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం గత ఏడు సంవత్స రాల పాలనలో కార్మిక,కర్షక,
ప్రజా వ్యతిరేక విధానాలను దూకుడుగా అమలు చేస్తుందని సి ఐ టి యు జిల్లా అధ్యక్షుడు ఎండి దావూద్ అన్నారు. దేశానికి ఆర్థిక వనరులను సమకూర్చే ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడి దారులకు కారుచౌకగా అమ్మి వేస్తున్నదని, నేషనల్ మానిటేషన్ పైప్ లైన్ పేరుతో ఇప్పటికే విమానాశ్ర యాలు,రైల్వేలు,బొగ్గు గనులు, బ్యాంకులు జీవిత బీమా(ఎల్ ఐ సి) సంస్థల్లో విదేశీ పెట్టుబడి దారులకు అనుమతి నిచ్చింద ని అన్నారు.మరొక వైపు కాంట్రాక్ట్,అవుట్సోర్సింగ్,ఫిక్స్డ్ టర్మ్, డైలీ వెజ్,ఎన్ ఎమ్ అర్, థర్డ్ పార్టీ, స్కీం వర్కర్లు తదితర అనేక పేర్లు పెట్టి కార్మికుల శ్రమను దోచుకునేందుకు ఈ లేబర్ కోడ్స్ తీసుకొచ్చి స్థిర మైన వేతనం,పని భద్రత, ఉపాధి కరువై పోయిందని అన్నారు.సామాన్య ప్రజల బతుకులు అతలాకుతలమైన వారిని ఆదుకునేందుకు సిద్ధపడక అమానుషంగా వ్యవహరిస్తూ పెట్రోల్,డీజిల్ వంట గ్యాస్ ఇతర నిత్యావసర సరుకులు ధరలు హద్దు అదుపు లేకుండా పెంచి ప్రజల నడ్డి విరిచిందని అన్నారు. ఇంకొక ఒకవైపు అన్నదాతలు అడుగుతున్న కనీస మద్దతు ధర ఊసేలేదని అన్నారు.
*ప్రజలను రక్షించండి_దేశాన్ని రక్షించండి*
అనే నినాదంతో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె కు 10 కేంద్ర సంఘాలు,స్వతంత్ర ఫెడరేషన్ లుఅసోసియేషన్లు,ఆశ,భవన నిర్మాణ కార్మికులు,కార్పెంట ర్స్,ఇతర అసంఘటిత రంగ కార్మికులు అధిక సంఖ్యలో ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయానికి హాజరు కావాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్య క్షులు చిటమట రఘు,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు కమిటీ సర్వర్,
వెంకటేశ్వర్లు,సిఐటియు మండల అధ్యక్షుడు బాలోజు రమేష్,కడవెండి నరసింహా చారి,ఎలక్ట్రిషన్ సంఘం మండల ఉపాధ్యక్షుడు నారాయణ,రైతు సంఘం మండల నాయకులు సంపత్ రావు, అంగన్వాడి సీనియర్ నాయకురాలు మార నాగలక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకుడు నాయిని కృష్ణ,మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ నాయకులు గులగట్టు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: