CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

28,29 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.-:సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్.

Share it:


మన్యం మనుగడ మంగపేట.

కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నేల 28,29 తేదీలలో జరుగు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ కార్మిక లోకానికి పిలుపునిచ్చారు.

 స్థానిక మండల కేంద్రంలో సీఐటీయూ సమావేశం మడే రవి అధ్యక్షత జరిగింది.

ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరయిన రాజేందర్ మాట్లాడుతూ దేశాన్ని పాలిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు.దేశాన్ని రక్షించుకుందాం ప్రజల్ని కాపాడుకుందాం పేరుతో దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ సమ్మె పాలక పక్షానికి హెచ్చరిక కావాలని అన్నారు.4 లేబర్ కోడ్ లని వెంటనే రద్దు చేయాలని,ప్రభుత్వ రంగ సంస్థలలో డిజ్ ఇన్వెస్టమెంట్ ఆపాలని,నేషనల్ మానిటైజెషన్ పైపులైన్ ఉపసంహరించాలని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 5 కనీస వేతనాల జీవోలను అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని అన్నారు.

అంగన్వాడీ,ఆశ,మధ్యాహ్న భోజనం పథకం,మోడల్ స్కూల్ ఇతర స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం, సామాజిక భద్రత పథకాలను అమలు చేసి,సర్వీస్ క్రమబద్దీకరించాలని అన్నారు.కాంట్రాక్ట్ కార్మికులందరిని పర్మినెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దేశ వ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత కార్మికుల హక్కుల సాధన కోసం,ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ కోసం జరిగే దేశ వ్యాప్త సమ్మెలో అన్ని రంగాల్లో పని చేసే కార్మికులు, ఉద్యోగులు,ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సదస్సులో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎండీ దావుద్ , ప్రసాద్,తోకల రవి, స్వరూప,శ్రావ్య,రాణి, విజయకుమారి, సుభద్ర, సుజాత, వెంకట లక్ష్మీ, పార్వతి, మేఘన, సంబలక్ష్మీ, పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: