CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మార్చి 28,29 లో జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు.కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి.

Share it:

 



        మన్యం మనుగడ వెబ్ డెస్క్ ,హైదరాబాద్:

      ప్రభుత్వరంగ సంస్థలను కార్పోరేట్ శక్తులకు అమ్మేస్తూ మనువాద మతోన్మాద ఉన్మాద ఆర్ ఎస్ ఎస్ బిజెపి అవలంభిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) రాష్ట్ర కమిటి సంపూర్ణ మద్దతు తెలుపుతోంది . కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ ని తిరస్కరిస్తుంది . ప్రైవేట్ వ్యక్తులకు, కార్పోరేట్ సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థల్ని కానుకగా కట్టబెట్టే విధానం వల్ల రిజర్వేషన్లకు గండికొట్టి సామాజిక న్యాయం దెబ్బతింటుంది. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఉద్యోగ, కార్మికుల వేతనాలుపై, ఉద్యోగ భద్రతపై, త్యాగాలతో సాధించుకున్న హక్కులపై దాడికి దిగుతున్నది . దీనివల్ల 29 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చింది . దీన్ని భారత కార్మిక వర్గం ఐక్యంగా తిప్పికొట్టాలని పేరుతో సార్వత్రిక సమ్మెకు పిలుపుఇవ్వడం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) స్వాగతిస్తుంది . మనువాద మతోన్మాద ఉన్మాద పూరిత ఆర్ ఎస్ ఎస్ బిజెపి ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో దళిత, గిరిజన , ప్రజాసంఘాలు , ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Share it:

TS

Post A Comment: