CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మణుగూరు మున్సిపల్ కమిషనర్ కు సమ్మె నోటీ స్ అందజేసిన ఐ.ఎఫ్.టి.యు.మార్చి 28, 29 తేదీల లో జరుగు అఖిలభా రత సమ్మెనుజయప్రదంచేయండి. ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి.

Share it:

 



తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఐ.ఎఫ్.టి.యు. మణుగూరు బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో

ఈరోజు మణుగూరు మున్సిపల్ కమిషనర్ కు సమ్మెనోటీస్ అందజేశారు

అనంతరం ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మోడీ పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను

రద్దు చేసి వాటి స్థానం లో నాలుగు లేబర్ కోడ్ ల తెచ్చాడని దీనివల్ల కార్మిక రంగానికి కొత్త హక్కులు రాకపోగా ఉన్న హక్కులు కూడా ఊడ కొడుతున్నాడని, అత్యంత ప్రమాదకరమైన ఈ నాలుగు లేబర్ కోడ్ లను ఉపసంహరిం చుకోవాలని డిమాండ్ చేశారు 

చాయ్ వాలా దేశానికి ప్రధాని అయితే దేశంలో అందరూ సుభిక్షంగా ఉండాలని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే మోడీ అచ్చేదిన్ పేరుతోటి దేశంలోఉన్న ప్రభుత్వ రంగ సంస్థల న్నింటిని ఒక్కొక్కటిగా ప్రైవేటు పరంచేస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నాలుగు రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశవ్యాప్తంగా సంవత్స రంపాటు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి చట్టాలను రద్దు చేయిం చుకున్నారు అని

రైతుల స్ఫూర్తితో కార్మి కులు 4 లెబర్ కోడ్ లకు వ్యతిరేకంగా పోరాడల న్నారు. ఈ నెల 28 29 తేదీలలో జరుగు దేశవ్యాప్త సమ్మెలో ప్రతి కార్మికుడు సమ్మెలో పాల్గొని కార్మిక సత్తా చాటాలని పిలుపు నిచ్చారు. అదేవిధంగా జీవో నెంబర్ 60 ప్రకారం జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లందు మున్సిపాలిటీలలో పెరిగిన వేతనాలు అమలవుతుండగా మణుగూరు లో మాత్రం అమలు కావడం లేదని విమర్శించారు. మణుగూరు మున్సిపల్ కార్మికులకు కూడా పెరిగిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

           ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు మణుగూరు ఏరియా నాయకులు ఎండీ.గౌస్, తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మణుగూరు బ్రాంచ్ కార్యదర్శి మిట్టపల్లి రాజేందర్, కార్మికులు నర్సింహ, సతీష్, లక్ష్మీనారాయణ, ప్రవీణ్, కార్తీక్, సరస్వతి, రమాదేవి, సాయమ్మ, పోచమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: