CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఈ నెల 28, 29 తేదీలలో జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.

Share it:

 



 మణుగూరు అఖిలపక్ష పార్టీల పిలుపు.


 ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, జాతీయ కార్మిక సంఘాలు, ప్రాంతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన ఈ నెల 28, 29 తేదీలలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపులో కార్మికులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అఖిలపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు.

             ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నాయకులు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. అయోధ్య, కాంగ్రెస్ నాయకులు బట్టా. విజయ్ గాంధీ, సిపిఎం మండల కార్యదర్శి, కొడిశపాల. రాములు, టీడీపీ. నియోజకవర్గ నాయకులు, వట్టం. నారాయణ దొర, సిపిఐ ఎంఎల్ ప్రజా పందా మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి ఆర్.మధుసూదన్ రెడ్డి లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంకార్మిక చట్టా లను రద్దు చేస్తూ వాటి స్థానంలో 4 లేబర్ కోడ్ లు తీసుకువ చ్చార ని కార్మిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ఈ నెల 28, 29 తేదీలలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వ ర్యంలో దేశవ్యాప్త సార్వ త్రిక సమ్మె జరుగు తుం దని, ఈసమ్మెనువిజయ వంతం చేయాలన్నారు.

బ్రిటిష్ కాలం నుంచి కార్మికులు, పోరాడిసాధిం చుకున్న 44 కార్మిక చట్టాలను నేటి ప్రభు త్వ0 రద్దు చేయడం దుర్మార్గమన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు కారుచౌకగా అమ్మి వేస్తున్నారని విమర్శిం చారు. దేశంలో నిరుద్యో గాన్ని, పేదరికాన్ని, అసమానతలను పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి, కార్మిక చట్టాలు అమలు కోసం రైతాంగ పోరాట స్ఫూర్తితో కార్మికవర్గం పోరాడాలని పిలుపుని చ్చారు. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమపోరాటాల ద్వారానే కార్మిక హక్కులను కాపాడు కోగలమని స్పష్టం చేశారు.

కార్మికవర్గం ఈ సమ్మెలో పాల్గొని మోడీ ప్రభుత్వా నికి గుణపాఠం చెప్పాల న్నారు.

           ఈ సమావేశం లో వాసిరెడ్డి. చలపతిరావు, ముని గల.శివ ప్రశాంత్, అక్కి. నరసింహారావు, రామానుజవరం సర్పంచ్ బాడిశ. సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: