మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అంగన్వాడీ టీచర్లు,తహసీల్దార్ కు ఏఐటీయూసీ వినతి పత్రం.బడ్జెట్ లో ఐసిడిఎస్ కు నిధులు పెంచాలి.కనీస వేతనం 26000 వేల ఇవ్వాలి.మినీ టీచర్స్ ను మెయిన్ టీచర్ గా ప్రమోట్ చేసి ఆయా సౌకర్యం కల్పించాలి.రిటెర్ అయినా టీచర్ కు 500000 ఆయా కు 300000 రూపాయలు రిటైర్ మెంట్ బెన్ఫిట్ కింద అందచేయ్యాలి.అంగన్వాడీ కార్యకర్తలకు పీ ఆఫ్ ఈ ఎస్ ఐ సౌకర్యం కల్పించాలి.
తదితర డిమాండ్ లతో కూడిన వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్ అంగన్వాడీ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి అరుణ ఏఐటీయూసీ మండల అధ్యక్షులు రాయపూడి రాజేష్ నాయకులు నాగమణి హంస వేణి దీప్తి శ్రీలత లత పద్మ సుశీల నాగలక్ష్మి సుధా సాహితీ శైలజ మంగతాయారు కరుణ సుమతి అలివేలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: