CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రచురుణార్థం ఇల్లందు మార్చి 15,2022.ఇల్లందు గిరిజన బాలికల ఓల్డ్ హాస్టల్ కు అనుసంధానంగా ఉన్న పాఠశాల హెచ్ఎం పై చర్యలు తీసుకోవాలి.--:విద్యార్థి సంఘాల డిమాండ్

Share it:


మన్యం మనుగడ వెబ్ డెస్క్ :

ఇల్లందు గిరిజన బాలికల ఓల్డ్ హాస్టల్ కు అనుసంధానంగా ఉన్న ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎలమందా విద్యార్థుల వద్ద పరీక్ష ఫీజుల పేరుతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేశారని తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ గౌడ్, పి డి ఎస్ యు డివిజన్ కార్యదర్శి బానోతు నరేందర్, పి డి ఎస్ యు జిల్లా కోశాధికారి గణేష్ అన్నారు. మంగళవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏ టి డి ఓ రూపాదేవి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆశ్రమ పాఠశాల హెచ్ఎం పరీక్షల ఫీజు పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుండి 300 రూపాయలు వసూలు చేస్తున్నట్లు గా విద్యార్థి సంఘాల దృష్టికి రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి డిడి రమాదేవి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఐటీడీఏ అధికారులు తమ కార్యాలయం నుండి హెచ్ ఎం కు ఫోన్ ద్వారా వివరణ కోరగా వసూలు చేసినట్లు అంగీకరించారు.ఇల్లందు ఏ టి డి ఓ విద్యార్థులను విచారించానని విద్యార్థులు తమ డబ్బులను హెచ్ఎం దగ్గర దాచుకున్నారని అసలు విషయాన్ని దాచి వేసి హెచ్ఎంకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఓ కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ఏ టి డి ఓ రూపాదేవి వాస్తవ విషయాలను సేకరించి డబ్బులు వసూలు చేసిన హెచ్ఎం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు కొత్తగూడెం డివిజన్ అధ్యక్షలు వంశీవర్థన్ పి డి ఎస్ యు ఇల్లందు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సాయి పార్థసారథి తరుణ్ కంపాటి కరుణాకర్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: