CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కిసాన్ మార్చ్ ను విజయవంతం చేయండి.ఈనెల11న గాంధీ భవన్ నుండి అగ్రికల్చర్ కార్యాలయం వరకు కిసాన్ మార్చ్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనుబంధ సంఘాల జిల్లా మండల నాయకులు కార్యకర్తలు ఎంపీపీ లు జెడ్పీటీసీ లు సర్పంచులు తరలి రావాలి.

Share it:

 *



  • రైతులను విస్మరించే లా రాష్ట్ర బడ్జెట్ ఉంది.
  • ఏటూరునాగారం కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గడ్డం శ్రీధర్.

మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రములో జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకు ల ముఖ్య కార్యకర్తల సమా వేశంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గడ్డం శ్రీధర్ మాట్లా డుతూ.జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ సూచనమేరకు.కెసిఆర్ బడ్జెట్ లో రైతులకు మొండి చేయి చూపడం జరిగిందని దీనికి నిరసన గా కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి ఆధ్వ ర్యములో ఈ నెల 11 న గాంధీ భవన్ నుండి అగ్రికల్చర్ కార్యాలయం వరకు కిసాన్ మార్చ్ కార్యక్రమం విజయ వంతం చేయాలని అయన పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి కెసిఆర్ రైతులను విస్మరించేలా రాష్ట్ర బడ్జెట్ ఉందని 

గతేడాది బడ్జెట్ తో చూస్తే.. 745.65 కోట్లు కోతపెట్టారు 

ఇందులో రైతు భీమా,రైతు బంధు కే ఎక్కువ నిధులు 

ధరల స్థిరీకరణకు మొండి చేయి చూపారని అని అన్నారు 

పంటల రుణమాఫీకి భారీగా నిధుల ప్రతి బడ్జెట్లో పేరుకు మాత్రమే కేటాయింపు ఆచరణ లో ఇప్పటి వరకు మాఫీ చేసింది కేవలం1098 కోట్లు అని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రుణ మాఫీ మాఫీ చేసింది లేదని, 

ఈ ముడేళ్ళల్లో వేయి98 కోట్లు మాత్రమే మాఫీ చేశారని, 

బడ్జెట్ లో ప్రకటన గానే ఉందని 

యాత్రికరణ కోసం 1100కోట్లు గతేడాది కేటాయిస్తే.. ఇప్పుడు 377.35 కోట్లే డ్రిప్ ఇరిగేషన్ కోసం కోటి 25లక్షలు కేటాయిం చారని అన్నారు.పంటల కొనుగోలు,వడ్లకొనుగోలు కోసం పైసా పెట్టలేదని,ఉద్యానవన శాఖకు వెయ్యి కోట్లు అని పెట్టిన మాట ఉత్తదేని అన్నారు 

పంటల రుణమాఫీ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం 

గత రబీ,ఖరీఫ్ సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యంలో జరిగిన అవినీతి నకిలీ విత్తనాలతో నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవడం

పంటల బీమా పథకం ద్వారా రైతులకు రావాల్సిన నష్టపరి హారం,కనీస మద్దతు ధరల జాబితాలో ఉన్న ప్రతి పంటను కొనుగోలు చేయాలని

ఈ యాసంగి వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని,ఆత్మహత్య చేసుకున్న రైతులకు రైతు భీమా కాకుండా 194 జి ఓ ప్రకారం ఎక్స్ గ్రేషియా ఇవ్వా లనే అంశాలన్నీ అసెంబ్లీలో చర్చ జరపాలని అయన డిమాండ్ చేశారు.కావున కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల జిల్లా మండల అధ్యక్షులు ఎంపీపీ జడ్పీటీసీ లు సర్పంచులు ఎంపీటీసీలు పెద్ద ఎత్తున హజరవ్వగలరాని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం మండల పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి మడుగురి ప్రసాద్,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య,ఎండీ ఖలీల్ ఖాన్ యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి గౌస్,జిల్లా మైనార్టీ కార్యదర్శి ఎండీ సులేమాన్,

వార్డునంబర్ పడిదల హనుమంత్,సాధనపల్లి లక్ష్మయ్య,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కర్నె సత్యం,సరి కొప్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: