CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రూ.1 కోటి 54 లక్షల రూపాయల తో నిర్మించిన గిరిజన భవనాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని వాసవి నగర్ నందు ఐటీడీఏ వారి ఆధ్వర్యంలో నూతనంగా రు.1 కోటి 54 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన గిరిజన భవనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ కోరం. కనకయ్య పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో నియోజకవర్గ వ్యాప్తంగా గల ఆదివాసీ ప్రజా ప్రతినిధులు,సంఘాల,నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ,ఆదివాసులు మెరుగైన చదువులు చదువుకొని ఉద్యోగాలు సాధించాలని,అంతేకాకుండా చట్టాలపై కూడా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు,ప్రవేశపెడుతుందని వాటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.గిరిజనుల విద్యార్థుల చదువుల కోసం మోడరన్ హాస్టల్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించిందని ప్రతి ఒక్కరు కూడా హాస్టళ్లల్లో చదువుకోవాలని ఆయన అన్నారు.ఆదివాసీలు ఉన్నత చదువులు చదువుకొని ఐఏఎస్,ఐపీఎస్ లుగా రాణించాలని అనేది తన కోరిక అని విప్ రేగా తెలియజేశారు. అంబేద్కర్ చూపిన మార్గంలో నడిచి విజయం సాధించాలని పిలుపునిచ్చారు.పేద విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, భద్రాచలం నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు,జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,స్థానిక సర్పంచ్ బచ్చల భారతి,ఎంపీపీ లు గుమ్మడి గాంధీ,జడ్పీటిసి లు, ఎంపీటీసీలు,సర్పంచ్ లు, ఆదివాసి ప్రజా ప్రతినిధులు, ఆదివాసి సంఘం నాయకులు, ఆదివాసి మేధావులు,ఉద్యోగ సంఘాల నాయకులు,తుడుం దెబ్బ నాయకులు,టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,కార్యదర్శులు, నాయకులు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: