మన్యం టీవి న్యూస్,ఆదిలాబాద్:
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కు కూతవేటు దూరంలో ఉన్న జెండాగూడ గ్రామ ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరుకున్న పట్టించుకునే నాథుడే లేడని విద్యార్థి యువజన సంఘాల నాయకులు అన్నారు. ఈ సందర్భంగా DYFI జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తిక్ , PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి లు మాట్లాడుతూ....... కొమురం భీం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ చాలా పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు విద్యాకు దూరమవుతున్నారు. చాలీచాలని కూలిపని చేసుకునే తల్లిదండ్రులు ప్రభుత్వ విద్య సంస్థలో విద్యార్థులను చదివిద్దామనుకుంటే ఎప్పుడు కూలి పోతాయో తెలియని పరిస్థితిలో వేరే గత్యంతరం లేక ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నారు. సరైన సౌకర్యాలు ఉంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. అలాంటిదే కొమరం భీమ్ జిల్లా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెండా గ్రామంలో గత కొద్ది సంవత్సరాల నుండి ఆ పాఠశాల భవనం కూలిపోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ విద్యాశాఖ అధికారులు ఎప్పుడు పట్టించుకున్న దాఖలాలు లేవు. సుమారుగా పాఠశాలలో 34 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి అని అని ప్రశ్నించారు . వెంటనే ఉన్నత అధికారులు స్పందించి ఆ పాఠశాలలకు నూతన భవనాన్ని నిర్మించాలని అన్నారు. అదే విధంగా జిల్లాలో గిరిజన పాఠశాలలు వాగ్దానం లో ఉన్న పాఠశాలలు ఉన్నప్పటికీ మార్కెట్ యార్డ్ లో రైతు బంధు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలో పాఠశాలను నడుపుతున్న బెల్గాం పాఠశాల పరిస్థితి ఉంది. కావున ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి బడి పథకం కింద పాఠశాలలకు నూతన భవనాన్ని తక్షణమే నిర్మించాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు. లేనియెడల జిల్లా వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
Post A Comment: